మ‌ణిర‌త్నంకు గుండెనొప్పి

Last Updated on by

స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం గుండె నొప్పితో చెన్నై అపోలో ఆస్ప‌త్రిలో అడ్మిట్ అవ్వ‌డం అభిమానుల్ని ఆందోళ‌న‌కు గురి చేసింది. ఈ వార్త ప్ర‌స్తుతం నెటిజ‌నుల్లో జోరుగా వైర‌ల్ అవ్వ‌డంతో ఏం జ‌రిగిందోన‌న్న ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మ‌ణి స‌ర్ అభిమానులు దైవ ప్రార్థ‌న‌లు చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. అయితే కాసేప‌టికే మ‌ణి స‌ర్ ఆరోగ్యం బావుంది. ఆయ‌న ఆరోగ్యానికి వ‌చ్చిన ఢోకా ఏం లేదు. రెగ్యుల‌ర్ చెక‌ప్ కోసం మాత్ర‌మే వ‌చ్చార‌ని పీఆర్‌వో చెప్ప‌డంతో ప‌రిస్థితి కూల్ అయ్యింది.

అయితే మ‌ణిర‌త్నంకు ఇదే తొలిసారి కాదు. ఇదివ‌ర‌కూ ప‌లు సంద‌ర్భాల్లో గుండెనొప్పి రావ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లి చికిత్స పొందారు. 2004లో హిందీ `యువ`షూటింగ్ టైమ్‌లో ఓసారి, 2009 – 2015లో ప‌లుమార్లు మణిరత్నం గుండెనొప్పిని ఎదుర్కొన్నారు. నేడు మ‌రోసారి కార్డియో ఎటాక్‌ని ఎదుర్కొన్నారు. ఓవైపు `చెక్క చివాంత వానం` అనే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మ‌ణి స‌ర్‌కి ఇలా అవ్వ‌డంతో చిత్ర‌యూనిట్ ఆందోళ‌న‌కు గురైంది. శింబు – విజయ్ సేతుపతి – అరవింద స్వామి – అరుణ్ విజయ్ – జ్యోతిక – అదితి రావు త‌దిత‌ర స్టార్ల‌తో రూపొందుతున్న‌ భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా ఇది.

User Comments