ఫ్యాన్స్ కు గుబులు.. మోక్షజ్ఞ పై పూరీ కన్ను 

నటసింహం నందమూరి బాలకృష్ణ – స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రీసెంట్ గా ‘పైసా వసూల్’ సినిమా రిలీజై డిజాస్టర్ గా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కానీ, ఈ ఒక్క సినిమాతో బాలయ్యకు – పూరీకి మధ్య స్ట్రాంగ్ బాండ్ ఏర్పడిపోవడం విశేషం. ముఖ్యంగా పూరీ వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయిపోయిన బాలయ్య.. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పూరీతో మరో సినిమా చేస్తానని అనడం గమనార్హం. అయితే, బాలయ్య ఫ్యాన్స్ మాత్రం పైసా వసూల్ చూశాక.. పూరీతో కొంచెం దూరంగా ఉండటమే మంచిందని చెప్పినట్లు టాక్ రావడం షాకింగ్ విషయమే. ఇక ఇప్పుడేమో అంతకుమించి షాక్ కొట్టే న్యూస్ ఒకటి సినీ సర్కిల్ లో చక్కర్లు కొడుతుండటం హాట్ టాపిక్ అనే అనాలి.
అదేంటంటే, బాలయ్య వారసుడిగా త్వరలోనే తెరంగేట్రం చేయనున్న నందమూరి మోక్షజ్ఞను లాంచ్ చేయాలని పూరీ తహతహలాడుతున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన అయితే ఏమీ లేదు గాని, పూరీ మాత్రం ఈ రకంగా ఇప్పుడు పావులు కదుపుతున్నాడని గుసగుసలు వినిపిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే, ఈ మధ్య ఓ సందర్భంలో మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ ఇచ్చేసిన విషయం తెలిసే ఉంటుంది. వచ్చే ఏడాది అంటే 2018 లోనే జూన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండొచ్చని బాలయ్య నమ్మకంగానే అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో బాలయ్యకు గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి మంచి హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ క్రిష్ తోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని అందరూ భావించారు.
కానీ, క్రిష్ ఇప్పుడప్పుడే ఖాళీ అయ్యే అవకాశాలు లేకపోవడంతో.. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ ను బాలయ్య సంప్రదించారని వార్తలు వినిపించాయి. కానీ, వాళ్ళు కూడా బిజీగా ఉన్నట్లే టాక్ రావడంతో.. బాలయ్య సరైన డైరెక్టర్ కోసం చూస్తున్నట్లే అనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో బాలయ్యతో ఏర్పడ్డ అనుబంధం కారణంగా మోక్షజ్ణను లాంచ్ చేసే బాధ్యతను పూరీ తీసుకుంటున్నాడనే టాక్ రాగానే నందమూరి ఫ్యాన్స్ కు గుబులు పట్టుకుందని కామెంట్స్ వినిపిస్తుండటం విశేషం. అసలే పూరీ ఇప్పుడు ఎలా పడితే అలా సినిమాలు తీసేస్తున్నాడనే భయం వాళ్ళకీ ఉండొచ్చు. ఏదిఏమైనా, ఓవైపు ఆకాష్ పూరీతో సినిమాకు పూరీ రెడీ అవుతుండటం.. రవి తేజతో ఓ సినిమాను ప్లాన్ చేస్తుండటం.. ఇప్పుడు మోక్షజ్ఞపై కన్నేయడం చూస్తుంటే.. పూరీ అండ్ బ్యాచ్ ఇప్పుడు ఇలా ఫీలర్లు వదులుతుందేమోననే డౌట్ రావడం ఖాయం. చూద్దాం మరి ఏది నిజమవుతుందో.