పూరీ వర్మలా చేయడు కదా..!

Last Updated on by

ద‌ర్శ‌కులు అన్న త‌ర్వాత క‌చ్చితంగా అప్ డేట్ అవ్వాల్సిందే. కాదు మేం అలాగే ఉంటాం అంటే వెన‌కబ‌డిపోతారు. ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్ దాదాపు ఇదే సిచ్యువేష‌న్ లో ఉన్నాడు. ఈయ‌న సినిమా అంటే మ‌న‌కు మ‌రోటి గుర్తు రావు.. గొడ‌వ‌లు త‌ప్ప‌. మాఫియా కూడా బోన‌స్. ఇక గ‌న్స్ అయితే చిన్న పిల్ల‌లు ఆడుకున్నట్లే. అంత‌గా అలాంటి సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయింది పూరీ బుర్ర‌. ఆ మెద‌డులో మ‌రో ఆలోచ‌నే రాదనే విమ‌ర్శ‌లు కూడా మొద‌ల‌య్యాయి. దాంతో ఇప్పుడు త‌న‌యుడి కోసం కొత్త క‌థ రాసుకున్నాడు. అది కూడా ఇండో పాక్ ప్రేమ‌క‌థ‌. మెహ‌బూబా అని దీనికి టైటిల్ కూడా పెట్టేసాడు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటే ఖచ్చితంగా పూరీలో పూర్తి మార్పు వ‌చ్చింద‌నే విష‌యం అర్థ‌మైపోతుంది. లిమిటెడ్ బ‌డ్జెట్ లోనే భారీ సినిమాలా చూపించాడు పూరీ. దానికితోడు యుద్ధం బ్యాక్ డ్రాప్ లో షాట్స్ కూడా అదిరిపోయాయి. వర్మ గారు టీజర్ ట్రైలర్ కోసం చాలా శ్రద్ధ తీసుకొంటాడు. అందుకే వాటి అవుట్ ఫుట్ కూడా బాగుంటుంది. అలాగే గురువు వ‌ర్మ‌లా టీజర్ మీద పెట్టిన శ్రద్ధ మూవీ మీద పెట్టాడా లేదా అని టెన్ష‌న్ ప‌డుతున్నారు పూరీ అభిమానులు. ఈ సినిమాను ల‌డ‌క్ లో ఎక్కువ భాగం షూట్ చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్.

అప్పుడెప్పుడో కెరీర్ కొత్త‌లో ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం.. ఇడియ‌ట్.. శివ‌మ‌ణి.. అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి లాంటి సినిమాల్లో పూరీ ప్రేమ‌క‌థ‌లు అదిరిపోయాయి. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు 1971 ఇండోపాక్ వార్ నేప‌థ్యంలో న‌డిచే ఓ ప్రేమ‌క‌థ‌ను తీసుకొస్తున్నాడు పూరీ. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పంజాబ్, మ‌ధ్య ప్ర‌దేశ్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. స‌మ్మ‌ర్ లో సినిమా విడుద‌ల కానుంది. టీజ‌ర్లో ఆకాశ్ ను పెద్ద‌గా చూపించ‌లేదు పూరీ. అంతా లొకేష‌న్స్ పైనే దృష్టి పెట్టాడు. ఇందులో హీరోయిన్ గా నేహాశెట్టి న‌టిస్తోంది. ఆమె పాక్ అమ్మాయిగా న‌టిస్తుంది. ఇండియ‌న్ అబ్బాయి.. పాక్ అమ్మాయి మ‌ధ్య ప్రేమ‌క‌థ అనేదే పెద్ద క‌మ‌ర్షియ‌ల్ పాయింట్.. అందులోనూ 1971 వార్ అనేది ఇంకా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ రెండింటి మ‌ధ్య‌లో పూరీ ప్రేమ‌క‌థ ఎలా ఉండ‌బోతుందో..? స‌మ్మ‌ర్ లో విడుద‌లకు ప్లాన్ చేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. మ‌రి ఇత‌ర వార‌సుల‌కు మంచి లాంఛింగ్ ఇచ్చిన పూరీ.. మెహ‌బూబాతో త‌న వార‌సుడికి ఎలాంటి సినిమా ఇస్తాడో..!

User Comments