ద‌ర్శ‌కేంద్రుడి రిజైన్ వెనక కార‌ణం అదేనా?

ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. 2015 నుంచి టీడీడీ బోర్డు స‌భ్యుడిగా ఉన్న ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేసారు. అందుకు ఆయ‌న వ‌యోభారం రీజ‌న్ గా చూపించారు. మ‌రి ఇప్ప‌టివ‌రకూ గుర్తి రాని వ‌యోభారం ఇప్పుడే ఎందుకు గుర్తొచిన‌ట్లు? ఆయ‌న త‌ప్పుకోవ‌డానికి అస‌లు కారణం అదేనా?  లేక‌ ఇంకేదైనా ఉందా? అంటే ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. సాధార‌ణంగా అధికార బ‌దిలి చోటు చేసుకునేట‌ప్పుడు కొన్ని మార్పులు స‌హ‌జం. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే ఏపీలో చోటు చేసుకుంది. టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో నామినేట్ అయిన ప‌ద‌వుల‌కు రాజానామా ప‌ర్వం మొద‌లైంది.

అధికార ప‌క్షానికి ఇష్టం లేని వారిని మార్చేయ‌డం జ‌రుగుతుటుంది. కొత్త ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత త‌మకు అనుకూలంగా వారిని రిక్రూట్ చేసుకోవ‌డం స‌హ‌జం. ఈ విష‌యాన్ని ముందే గ్ర‌హించిన ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని టీడీపీ బోర్డు స‌భ్య‌త్వం నుంచి త‌ప్పుకున్నట్లు తెలుస్తోంది. రాఘ‌వేంద్ర‌రావుని శ్రీవెంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ చైర్మ‌న్ ప‌ద‌విని అప్ప గిస్తూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్ప‌ట్లో నియ‌మించింది. కానీ ఇప్పుడా ఆ ప్ర‌భుత్వం అధికారంలో లేక పోవ‌డం? వైకాపా అధికారంలోకి రావ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

మంగ‌ళ‌వారం టీడీడీ బోర్డు మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ స‌మావేశంలో అన్ని వివ‌రాలు ద‌ర్శ‌కేంద్రుడు వివ‌రించ‌నున్నారు. అలాగే ఏపీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌గా న‌టి పూన‌మ్ కూర్ ను, పుష్క‌రాలు ప్ర‌చాక‌ర్త‌గా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్ప‌ట్లో నియ‌మించింది. ముకఖ్యంగా ఎలాంటి ఇమేజ్ లేని పూన‌మ్ ను నియ‌మించ‌డం వెనుక పొలిటిక‌ల్ గేమ్ ఉంద‌ని ప్ర‌చారం సాగింది. జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్య‌ణ్ తో తో పూన‌మ్ కు విబేధాలు కారణంగా ఆమెను పావులా వాడుతున్న‌ట్లు అప్ప‌టి ప్ర‌తి ప‌క్షాలు భావించాయి. ఇక బోయ‌పాటిని త‌మ వ‌ర్గీయుడిగా భావించి బాబు వెలుగులోకి తీసుకొచ్చిన‌ట్లు ప్ర‌చారం సాగింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే వాళ్లు కూడా రాజీనామాలు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.