రాజ‌మౌళితో మైత్రి కుదిరిందా..?

Last Updated on by

రాజ‌మౌళి.. ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో ఇప్పుడు ఈయ‌న‌. ఎందుకంటే ఈయ‌న్ని ద‌ర్శ‌కుడు అన‌లేం. ఏ సినిమాకు అయినా ద‌ర్శ‌కుడి కంటే హీరోను చూసి ఎక్కువ ఓపెనింగ్స్ వ‌స్తాయి. కానీ ఇక్క‌డ రాజ‌మౌళి పేరు క‌నిపిస్తే హీరో ఎవ‌ర‌నేది అవ‌స‌రం లేదు. అంత‌గా రాజ‌మౌళి ఇమేజ్ పెరిగిందిపుడు. దాంతో ఇప్పుడు ఈయ‌న హీరోల కంటే ఎక్కువ‌. ద‌ర్శ‌క‌ధీరుడు ఓకే అనాలే కానీ ఎన్ని కోట్లైనా పెట్ట‌డానికి కొంద‌రు నిర్మాత‌లు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈయ‌న ఒప్పుకోవాలి క‌దా..? ఇప్పుడు క‌మిటైన దాన‌య్య సినిమానే ఎప్పుడో రెండేళ్ల కింద ఆయ‌న‌కు ఇచ్చిన మాట‌. దాంతో చ‌ర‌ణ్- ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల‌తో క‌లిపి మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు దాన‌య్య‌. ఇది అక్టోబ‌ర్ లో ప‌ట్టాలెక్క‌నుంది. 2020లో విడుద‌ల కానుంది.

ఇదింకా సెట్స్ పైకి కూడా వెళ్ల‌లేదు అప్పుడే మ‌రో సినిమా కూడా రాజ‌మౌళి ఒప్పుకున్నాడ‌ని తెలుస్తుంది. అది మైత్రి మూవీ మేక‌ర్స్ తో ఉండ‌బోతుంది. ఇప్ప‌టికే తెలిసిన స‌మాచారం ప్ర‌కారం మైత్రి మూవీ మేక‌ర్స్ రాజ‌మౌళితో ఒప్పందం కుదుర్చుకున్నార‌ని.. ఈ చిత్రం 2020లో ప‌ట్టాలెక్క‌బోతుంద‌ని.. హీరో ఎవ‌రో మాత్రం ఇంకా తేలలేద‌ని తెలుస్తుంది. ఎప్పుడో రెండేళ్ల త‌ర్వాతి సినిమాకు ఇప్ప‌ట్నుంచే హ‌డావిడి ఎందుకు అనుకుంటే కూడా పొర‌పాటే. ఎందుకంటే అక్క‌డున్న‌ది రాజ‌మౌళి క‌దా.. ఆయ‌న ఎప్పుడు ఓకే చెప్పినా ముందు డేట్స్ అయితే తీసుకుని పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత ఆయ‌నే గుర్తు పెట్టుకుని మ‌రీ సినిమాలు చేస్తూ ఉంటారు. మొత్తానికి అప‌జ‌యం లేని ద‌ర్శ‌కుడు.. అప‌జ‌యం లేని నిర్మాత‌లు క‌లిసి ఎలాంటి సినిమా చేస్తారో..!

User Comments