వర్మను ప్ర‌శ్నించే హ‌క్కు పోలీసులకు లేదట..!

Last Updated on by

ఎంత‌వార‌లైనా ఎప్పుడో ఓ టైమ్ లో కాలానికి పాదదాసులే. ఇప్పుడు వ‌ర్మ‌కు ఆ టైమ్ వ‌చ్చింది. ఇన్నాళ్లూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిరిగిన వ‌ర్మ‌.. ఓ సినిమాతో పోలీసుల గ‌డ‌ప తొక్కాల్సి వ‌చ్చింది. అది కూడా మొన్న చేసిన జిఎస్టీ వ‌ల్లే. ఇన్నాళ్లూ ఎన్నో సంచ‌ల‌నాత్మ‌క సినిమాలు చేసిన వ‌ర్మ‌.. ఎప్పుడూ పోలీసుల ముందుకు వెళ్ల‌లేదు. కానీ జిఎస్టీతో మాత్రం ఈయ‌న్ని పోలీసులు ముప్పుతిప్ప‌లు పెట్టారు. త‌నపై ఫైల్ అయిన కేసులో విచార‌ణ‌కు పోలీసులు ముందుకు వ‌చ్చాడు వ‌ర్మ‌. సాధార‌ణంగా వ‌ర్మ‌ను ఎవ‌రైనా ప్ర‌శ్న‌లు అడ‌గాలంటే కాస్త భ‌య‌ప‌డ‌తారు. అందుకే పోలీసులు ఆయన కోసం ప్ర‌త్యేకంగా ఓ ప్ర‌శ్నాప‌త్రాన్నే సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తుంది. ముందు మియా మాల్కోవా నుంచి ఈ ప్ర‌శ్నావ‌ళి మొద‌లైన‌ట్లు స‌మాచారం.

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ లో అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాను ఎందుకు తీసుకున్నారు..? ఈ సినిమాకు పెట్టుబ‌డి ఎవ‌రు పెట్టారు..? ఈ సినిమాను విదేశాల్లో తీసామ‌న్నారు క‌దా.. మ‌రి దానికి సాక్ష్యాలేంటి..? అందులో న‌టించిన వాళ్ల‌తో పాటు దానికి ప‌నిచేసిన టెక్నిక‌ల్ టీంకు ఎవ‌రు డ‌బ్బులిచ్చారు అని వ‌ర్మ‌ను పోలీసులు అడిగిన‌ట్లుగా తెలుస్తుంది. అంతేకాదు గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వీడియోను విదేశాల నుండి అప్ లోడ్ చేసామంటున్నారు క‌దా.. అక్క‌డ ఎవ‌రి నుంచి మీరు అప్ లోడ్ చేసి క్యాష్ చేసుకున్నార‌ని వ‌ర్మ‌ను పోలీసులు అడిగారు. అస‌లు మీరు పోస్ట్ చేసిన విమియో వెబ్ సైటుకు మీకు ఉన్న లింకేంటి..? ఆ సంస్థ మీకు డబ్బులు ఇచ్చారా అని పోలీసులు అడిగిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అయితే వ‌ర్మ‌ను పోలీసులు ఎన్ని ప్ర‌శ్న‌లు అడిగినా కూడా వ‌ర్మ మాత్రం తాను ఈ సినిమాను ఇండియ‌న్ రూల్స్ ప్ర‌కారం తీయ‌లేదు.. విదేశాల్లో తీసాను.. అందుకే ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ కు ఈ సినిమాపై త‌న‌ను ప్ర‌శ్నించే హ‌క్కు లేద‌ని చెబుతున్న‌ట్లు తెలిసింది. టీవీ ఛానెల్స్ లో కాఫీ తెపించుకొన్నట్లు వర్మ అక్కడ కూడా తెప్పించుకొన్నాడో లేదో పాపం.

ఆ విష‌యం అలా ఉంటే.. ఆ మ‌ధ్య ఓ లైవ్ ప్రోగ్రామ్ లో మహిళా సంఘాల నేత‌ల‌తో మాట్లాడుతూ అభ్యంతరకరమైన కామెంట్స్ చేసాడు వ‌ర్మ‌. ఈ జిఎస్టీ మీతోనే తీస్తానంటూ 50 ఏళ్ల మ‌హిళ‌తో అస‌భ్యంగా మాట్లాడాడు వ‌ర్మ‌. ఇదే ఇప్పుడు అస‌లు సంచ‌ల‌నం అయి కూర్చుంది. స‌దరు మ‌హిళ సంఘాల నేత వ‌ర్మ‌పై కేస్ ఫైల్ చేసింది. ఈ విష‌యంపై కూడా వ‌ర్మ‌ను పోలీసులు ప్ర‌శ్నించారు. ఈ విచార‌ణ అనంత‌రం వ‌ర్మ మొబైల్ ఫోన్.. త‌న ప్రైవేట్ ల్యాప్ టాప్ ను పోలీసులు సీజ్ చేసారు. వ‌ర్మ విచార‌ణ దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది. ఎంత‌సేపు ప్ర‌శ్నించినా వ‌ర్మ మాత్రం ఎక్క‌డా విసుగ్గోలేద‌ని.. అడిగిన వాటికి ఓపిగ్గానే స‌మాధానం చెప్పాడ‌ని.. పోలీసులు అడిగిన వాటికి త‌న‌దైన శైలిలోనే వ‌ర్మ ఆన్స‌ర్స్ ఇచ్చాడ‌ని తెలుస్తుంది. ఫిబ్ర‌వ‌రి 23న మ‌ళ్లీ వ‌ర్మ పోలీసుల ముందుకు రానున్నాడు.

User Comments