ప్రేమ‌లో ప‌డిన ఆర్జీవి..

Last Updated on by

ఏంటి ఈ జీవిని ప్రేమ‌లో పడేసే వాళ్లు కూడా ఉన్నారా..? అస‌లు వ‌ర్మ‌కు ప్రేమించ‌డం కూడా తెలుసా..? ఇదెప్ప‌ట్నుంచి జ‌రుగుతుంది..? అస‌లిది క‌ల‌యా నిజ‌మా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి క‌దా..! ప్రేమించ‌డం.. గౌర‌వించ‌డం.. ఆశీర్వ‌దించ‌డం.. ఇలాంటి మాట‌లు వ‌ర్మ‌కు కాస్త చిరాకు తెప్పిస్తుంటాయి. ఇవేవీ లేకుండా మెకానిక‌ల్ గా బ‌త‌క‌డం త‌న‌కు ఇష్ట‌మ‌నే ఫిలాస‌ఫీ వ‌ర్మ‌ది. అయితే త‌న‌కు కూడా ఇప్పుడు ప్రేమించ‌డం తెలుసు అంటున్నాడు. అబ్బో.. వ‌ర్మ‌లో ఇంత మార్పు ఎందుకొచ్చింది.. ఎప్పుడొచ్చింది అనుకుంటున్నారా..? ఇప్పుడు కూడా ఏమీ రాలేదు.

Director Ram Gopal Varma Fall in Love With a Dog

వ‌ర్మ‌ ప్రేమిస్తానంటున్నది మ‌నుషులను కాదులెండి. కుక్కల‌ను.. ఎందుకో తెలియ‌దు కానీ ఈయ‌నేదో మంచి మూడ్ లో ఉన్న‌పుడు ఓ కుక్క‌ను ఇంటికి తీసుకొచ్చిన‌ట్లున్నాడు. ఇప్పుడు దాన్ని చేతిలో ఎత్తుకుని చూడండి.. త‌న‌కు కూడా ప్రేమించ‌డం తెలుసు అంటూ పోజిచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ముందు మ‌నుషుల‌ను ప్రేమించ‌డం నేర్చుకుంటే.. ఆ త‌ర్వాత కుక్క‌ల్ని, మొక్క‌ల్ని, న‌క్క‌ల్ని ప్రేమించొచ్చు అంటున్నారు ఆ ఫోటోను చూసిన‌వాళ్లు. ఏదేమైనా దేన్నో ఒక‌దాన్ని ముందు ప్రేమించ‌డం అయితే నేర్చుకున్నాడు క‌దా.. ఆ కుక్క‌ల మీద ప్రేమ కాస్తా మ‌నుషుల మీద‌కు రాదంటారా..? ఏమో లెట్స్ వెయింట్ అండ్ సీ..!

User Comments