అర్జున్ రెడ్డి కా బాప్ వస్తుంది

Last Updated on by

అర్జున్ రెడ్డి బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది.. సందీప్ రెడ్డి వంగానే అక్క‌డ కూడా రీమేక్ చేస్తున్నాడ‌ని ఈ మ‌ధ్యే అనౌన్స్ మెంట్ వ‌చ్చింది. ఇలాంటి టైమ్ లో అర్జున్ రెడ్డి కా బాప్ అని ఆనుతున్నారేంటి అని అనుకొంటున్నారా..! ఈ మాట చెప్పింది ఎవ‌రో కాదు ద‌ర్శ‌కుడు సందీపే. ఏం లేదు ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. అర్జున్ రెడ్డిని తెలుగులో తీసిన‌పుడు ఈయ‌న‌కు చాలా ఆంక్ష‌లు ఉన్నాయి. ఇవి చేయ‌కూడ‌దు.. అవి తీయకూడ‌దు అని. కానీ ఇప్పుడు హిందీలో అవేవీ లేవు.. అక్క‌డ సెన్సార్ బోర్డ్ మ‌న‌లా కాదు. చాలా కూల్.. ఏదైనా తీయొచ్చు.

అందుకే అర్జున్ రెడ్డిని మ‌రింత ఫ్రెష్ గా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. తాను ఇక్క‌డ తీయ‌లేనిది కూడా అక్క‌డ చేస్తానంటున్నాడు. ఒరిజిన‌ల్ చూసిన వాళ్ల‌కు కూడా ఇది రీ ఫ్రెషింగ్ గా అనిపించేలా రీమేక్ చేస్తానంటున్నాడు సందీప్. దీనికోస‌మే ప్ర‌స్తుతం క‌థ మ‌ళ్లీ రాస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. జూన్ నుంచి ప‌ట్టాలెక్క‌బోతుంది ఈ చిత్రం. షాహిద్ క‌పూర్ కూడా అర్జున్ రెడ్డి పాత్ర‌ను ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఈ రీమేక్ ఎలా ఉండ‌బోతుందో..?

User Comments