శంక‌ర్ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు!

Last Updated on by

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఆ ఘ‌ట‌న‌కు ఎంత‌గానో భ‌య‌ప‌డిపోయి అప‌రాధ భావ‌న‌లోకి వెళ్లిపోయాడు. అంత‌గా ఏం జ‌రిగింది?  ఇన్నాళ్లు తెలియ‌ని ఆ నిజం ఇప్పుడే ఎందుకు తెలిసింది?  చెక్ డీటెయిల్స్‌….

అవును.. ఇది నిజ‌మే.. శంక‌ర్ ఓ భ‌యాన‌క‌మైన ఘ‌ట‌న‌ను క‌ళ్లారా చూశాడు. త‌న క‌ళ్ల ముందే కొంద‌రు ఎత్తు నుంచి కింద‌ప‌డ‌ది గిల‌గిలా కొట్టుకుంటుంటే, ఒళ్లంతా ర‌క్త‌మోడి, క‌ళ్ల వెంబ‌డి ర‌క్తం కారుతుంటే అది చూసి త‌ట్టుకోలేక విల‌విలా ఏడ్చేశాడు. అస‌లు ఈ ఘ‌ట‌న ఎప్పుడు జ‌రిగింది? అన్న వివ‌రంలోకి వెళితే.. అప్పుడు అన్నియ‌న్ (అప‌రిచితుడు) కోసం ఓ భారీ ఇండోర్ స్టేడియంలో అతి భారీ ఫైట్‌ని తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు 150 మంది ఫైట‌ర్లు ఈ షూటింగులో పాల్గొన్నారు. అందులో దాదాపు 70 నుంచి 75 మంది గాల్లోకి ఎగిరి ఫ‌ల్టీలు కొట్టే సీన్‌లో న‌టించాల్సి ఉంది. ఈ సీన్ లో అంద‌రికీ తాళ్లు క‌ట్టి ఒకేసారి లాగాలి. స్టేడియం బయట ఉన్న ఓ లారీకి ఆ తాళ్లను కట్టి.. ఎంతో ఎత్తులో ఉన్న అందర్నీ లాగాలని పీటర్‌ మాస్టర్‌ ప్లాన్‌ చేశారు. ఆ టైమ్‌లో లారీ డ్రైవ‌ర్ చేసిన పొర‌పాటు ఏకంగా అంద‌రికీ పెను ప్ర‌మాదానికి కార‌ణ‌మైంది. శంక‌ర్ ఇంకా యాక్షన్‌ అని చెప్పకుండానే డ్రైవ‌ర్ లారీ నడిపించేశాడు. ఇంకేం ఉంది గాల్లో ఉన్న స్టంట్‌మ‌న్లు రియ‌ల్‌గానే అంతెత్తు నుంచి కింద గ‌చ్చు మీద‌ ప‌డ్డారు. . ఆన్‌ లొకేషన్‌ రక్తంతో నిండిపోయింది. స్టంట్‌మ‌న్‌ చేతులు, కళ్ల నుంచి ర‌క్తం కారింది. ఆ టైమ్‌లో కొంద‌రికి ఫిట్స్ కూడా వ‌చ్చింది. చివ‌రికి ఎలాగోలా అంద‌రినీ ఆస్ప‌త్రికి చేర్చి వైద్యం అందించి కాపాడుకున్నారు. కానీ ఆ రోజు శంకర్‌ ఎంత‌గానో కుంగిపోయారు. ప్ర‌మాదం చూసి చిన్నపిల్లాడిలా ఏడ్చారు. ఈ వివ‌రాల‌న్నీ ఆన్ లొకేష‌న్ ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌త్య‌క్షంగా చూసిన అసిస్టెంట్ ఫైట్ మాష్ట‌ర్ సెల్వ తెలిపారు. ఆ ఘ‌ట‌న చూశాక తాను ఎంతో బాధ‌ప‌డ్డాన‌ని సెల్వ అన్నారు.

User Comments