రంగస్థలం లేటు.. చెర్రీపై సుకుమార్ కోపం

టాలీవుడ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ‘రంగస్థలం 1985‘ అనే క్రేజీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని స్టార్ట్ చేసినప్పుడే అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలుసు. కానీ, చెర్రీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో కాస్త స్లో అవడంతో సుకుమార్ కోపంగా ఉన్నాడని.. దీంతో సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని టాక్ వినిపిస్తుండటం షాకింగ్ న్యూస్ గా మారింది.

ముందుగా రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ ని నేషనల్ లెవెల్ లో నిర్మించడానికి రెడీ అవుతుండటంతో చాలావరకు టైమ్ దానికే కేటాయిస్తున్నాడట. రీసెంట్ గా ఇలానే చిరు బర్త్ డే రోజున సైరా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ కోసం చెర్రీ రంగస్థలం షెడ్యూల్ ను కూడా కాదనుకుని మరీ దానికి టైమ్ ఇచ్చాడని తెలియడం గమనార్హం. ఈ కారణంగా ఇప్పుడు మిగతా నటీనటుల డేట్స్ కూడా కాస్త క్లాష్ అయ్యేలా ఉండటమే కాకుండా సినిమా కూడా లేట్ అయ్యేలానే కనిపిస్తుందట.

మొత్తంగా రంగస్థలంపై చెర్రీ ఫోకస్ కాస్త తగ్గడం, మెగా 151వ సినిమా పట్టాలెక్కేవరకు చెర్రీ బిజీగానే ఉండేలా పరిస్థితులు కనిపిస్తుండటం.. ఇప్పుడు సుకుమార్ కు కోపం తెప్పిస్తున్నాయని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని, సినిమా అయితే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదని, ఏకంగా ఏప్రిల్ 20 కి వాయిదా వేయడమే కరెక్ట్ అని మూవీ యూనిట్ భావిస్తోందని మరోవైపు గుసగుసలు వినిపిస్తుండటం నిజంగా షాకిచ్చే విషయమే అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నెలలు వాయిదా అంటే, అది నిజమే అయితే.. సినిమా ఎంత స్లో గా ముందుకు వెళుతుందో అర్థమైపోతుంది. ఏదిఏమైనా, సుకుమారే కొంచెం సినిమాను స్లో గా తీస్తాడనే పేరుంటే.. ఇప్పుడు చెర్రీ కూడా మెగా సినిమాతో బిజీగా ఉండటం.. రంగస్థలం లాంటి ఆసక్తికర సినిమాను వెనక్కి నెట్టినట్లేనని చెబుతుండటం నిజం కాకుంటే బాగుంటుందేమో.

Follow US