హీరోల్ని మోసం చేస్తోన్న సుకుమార్

Last Updated on by

సుకుమార్ సినిమా అంటే కొన్ని లెక్క‌లుంటాయి. ఆయ‌న ద‌ర్శ‌కుడు కాక‌ముందు లెక్క‌ల మాస్టారు. ఆ లెక్కల ప్ర‌భావం ఇప్ప‌టికీ ఇలాగే ఉంది ఈ ద‌ర్శ‌కుడిపై. ఇదే సినిమాల్లోనూ క‌నిపిస్తుంటుంది. త‌న సినిమాల్లో లెక్క‌లు కావాల్సిన‌న్ని చెబుతుంటాడు సుకుమార్. అర్థ‌మైతే సినిమా హిట్ లేదంటే ఫ‌ట్. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్య‌లో మాత్రం ఈయ‌న చెప్పిన ప్రేమ‌లెక్క‌లు బాగా అర్థ‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత 100 ప‌ర్సెంట్ ల‌వ్ లో కాస్తే అర్థం అయ్యాయి. ఇక నేనొక్కడినే.. నాన్న‌కు ప్రేమ‌తో లాంటి సినిమాలు టిపిక‌ల్ సుకుమార్ సినిమాలు. ఆర్య 2, జ‌గ‌డం డిజాస్ట‌ర్లు. ఇలా సాగిపోతున్న త‌రుణంలో ఇప్పుడు రంగ‌స్థ‌లంతో వ‌స్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మార్చ్ 30న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఎందుకో తెలియ‌దు కానీ ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలో అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఖచ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అనే ఊహ‌ల్లో ఉన్నారు అభిమానులు కూడా. రంగ‌స్థ‌లం ట్రైల‌ర్.. సాంగ్స్ కి వ‌స్తున్న రెస్పాన్స్ చూసి సినిమా సుకుమార్ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉన్నాడు. నాన్న‌కు ప్రేమ‌తో యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగినా.. ఈ సారి మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకునేలాగే క‌నిపిస్తున్నాడు. అందుకే రంగ‌స్థ‌లం విడుద‌ల‌కు ముందే నెక్ట్స్ సినిమాపై టాక్స్ మొద‌ల‌య్యాయి. బ‌న్నీతో సుకుమార్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ లో ఆర్య‌.. ఆర్య 2 సినిమాలు వ‌చ్చాయి. వీటిలో ఆర్య ట్రెండ్ సెట్ట‌ర్.. కానీ ఆర్య 2 మాత్రం డిజాస్ట‌ర్. అది పోయినా కూడా మ‌రోసారి సుకుమార్ తో వ‌ర్క్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు బ‌న్నీ. ఏం మాయ చేస్తున్నాడో గానీ.. సుకుమార్ అడగ్గానే స్టార్ హీరోలంతా కాదన‌కుండా డేట్స్ ఇస్తుంటారు. కానీ ఆయ‌న మాత్రం అందరికి హిట్ ఇవ్వ‌కుండా మోసం చేస్తుంటాడు.

User Comments