ఆ హీరోయిన్ బాధ్య‌త మ‌ళ్లీ ఆ ద‌ర్శ‌కుడిదేనా?

Director Taking the burden Of actress

తెర‌పైన కొద్దిమంది హీరోహీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో… తెరవెన‌క కొంత‌మంది హీరోయిన్లు, ద‌ర్శ‌కుల మ‌ధ్య కెమిస్ట్రీ అంత‌కంటే బాగుంటుంది. స‌దరు హీరోయిన్లు, ద‌ర్శ‌కుల గురించీ.. వాళ్ల మ‌ధ్య బంధం గురించి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటుంటారు. వాళ్లు త‌రచూ క‌లిసి ప‌నిచేస్తుండ‌డం కూడా అందుకు ఓ కార‌ణం. ఈ యేడాదే ఓ పెద్ద సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన ద‌ర్శ‌కుడికీ, మ‌రో హీరోయిన్‌కీ మ‌ధ్య మంచి అండ‌ర్‌స్టాండింగ్ ఉంద‌ట‌. వాళ్ల మ‌ధ్య బాండింగ్ పీక్స్‌కి వెళ్లింద‌ని… అందుకే ఆ హీరోయిన్‌కి ఆ ద‌ర్శ‌కుడు ప‌దే ప‌దే అవ‌కాశాలిస్తుంటాడ‌ని ప్ర‌చారం సాగింది. ఆ ద‌ర్శ‌కుడు ఈమ‌ధ్య తీసిన పెద్ద సినిమాలో కూడా ఆ హీరోయిన్‌కి ఏదో ర‌కంగా ఛాన్స్ ఇవ్వాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నించాడ‌ట‌. కానీ అది కుద‌ర‌లేద‌ట‌. నిర్మాత వ‌ద్ద‌ని చెప్ప‌డంతోపాటు… ఆ బాండింగ్ గురించి కూడా సుతిమెత్త‌గా కొన్ని సూచ‌న‌లు చేశాడ‌ట‌. దాంతో ఆ ద‌ర్శ‌కుడు త‌న ప్ర‌యత్నాన్ని మానుకున్నాడ‌ట‌. ఈసారి మాత్రం క‌చ్చితంగా ఆమెకి లిఫ్ట్ ఇవ్వాల్సిందే అని ఫిక్స‌య్యాడ‌ట. ఆమెకి కూడా ప్ర‌స్తుతం సినిమాలేమీ లేవు. చేసిన రెండు సినిమాలు కూడా పెద్ద‌గా ఫ‌లితాన్ని తీసుకురాలేదు. దాంతో త‌న కెరీర్ బాధ్య‌త‌నంతా ఆ ద‌ర్శ‌కుడిపైనే వేసింద‌ట. దర్శ‌కుడు కూడా గ‌ట్టిగానే హామీఇచ్చాడ‌ని, వాళ్లిద్ద‌రి మ‌ధ్య బంధం అలా బ‌ల‌ప‌డిపోయింద‌ని ఇండస్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.