ఈ ద‌ర్శ‌కుడుకి ఏం అయింది

Last Updated on by

అవును.. ఈ ద‌ర్శ‌కుడు గ‌జినీ అయిపోయాడు. ఏదైనా మ‌రిచిపోవ‌చ్చు కానీ చేసిన మేలు మాత్రం మ‌రిచిపోకూడ‌దంటారు. కానీ త‌రుణ్ భాస్క‌ర్ అది కూడా మరిచిపోయాడు. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడికి రివ్యూ రైట‌ర్స్ పై కోపం వ‌చ్చేసింది. అందుకే ఓ తిట్టు తిట్టేసి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసాడు. చేస్తే అకౌంట్స్ మూసే వ‌ర‌కు బాగానే ఉంది కానీ రివ్యూ రైట‌ర్స్ కు స్టాండ‌ర్డ్స్ లేవు.. తెలుగులో ఎవ‌రికి రివ్యూలు రాసే అర్హ‌త లేదు.. వాళ్ల‌కు ఆ తెలివి లేదు.. మినిమ‌మ్ సినిమా అప్రిషియేష‌న్ కోర్స్ చేసిన వాళ్ల‌కు త‌ప్ప మిగిలిన వాళ్ల‌కు రివ్యూలు రాసే అర్హ‌తే లేదు.. స్క్రీన్ ప్లే గురించి.. రైటింగ్ గురించి వాళ్లకేం తెలుసు రాయ‌డానికి అంటూ ట్విట్ట‌ర్ లో ఏదేదో రాసుకొచ్చాడు త‌రుణ్ భాస్క‌ర్. ఇదంతా ఈ న‌గ‌రానికి ఏమైందికి యావ‌రేజ్ రివ్యూలు రాసినందుకు ఆయ‌న‌కు వ‌చ్చిన కోపం.

సినిమాలో విష‌యం ఉందా లేదా అనేది ఒక్క‌సారి త‌రుణ్ భాస్క‌ర్ ఆలోచించుకుంటే మంచిది. ఈ చిత్రానికి యంగ్ త‌రంగ్ బాగానే వెళ్తున్నారు.. వ‌సూళ్లు కూడా బాగానే వ‌స్తున్నాయి. అయితే త‌న సినిమాను ఎందుకు బాలేద‌ని రాసారంటూ ఇప్పుడు విరుచుకుప‌డుతున్నాడు త‌రుణ్. మ‌రి ఇదే ద‌ర్శ‌కుడికి ఏ గుర్తింపు లేని స‌మ‌యంలో పెళ్లిచూపులు చేస్తే మ‌రి దాన్ని ప్ర‌మోట్ చేసిందెవ‌రు..? ఆ సినిమా అంత పెద్ద విజ‌యం సాధించిందంటే అందులో రివ్యూల పాత్ర కూడా ఉంది క‌దా.. ఆ విష‌యాన్ని త‌రుణ్ భాస్క‌ర్ మ‌రిచిపోయాడు. అప్పుడు కంటెంట్ ఉన్న సినిమా చేసాడు కాబ‌ట్టి అంతా క‌ట్ట‌గ‌ట్టుకుని ప్ర‌మోట్ చేసారు.. ఇప్పుడు కాస్త తేడాగా ఉన్న సినిమా చేసాడు కాబ‌ట్టి విమ‌ర్శించారు. ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పినందుకు కూడా అక్షింత‌లు వేయ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్..? అప్పుడే గ‌తాన్ని మ‌రిచిపోతే ఎలా అంటూ ఈ ద‌ర్శ‌కుడికి రివ‌ర్స్ కౌంట‌ర్స్ కూడా బాగానే ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై ఈ కుర్ర ద‌ర్శ‌కుడు ఏమంటాడో..?

User Comments