వినాయక్ డ్రీం మహేష్ తో చేయడం.. మరి ఎప్పుడు?

అవును.. ఇప్పుడు ఇదే జ‌ర‌గ‌బోతుంది. ఇండ‌స్ట్రీలో ఉన్న అగ్ర ద‌ర్శ‌కులంద‌రితోనూ ప‌ని చేసాడు మ‌హేశ్. కానీ రాజ‌మౌళి, వినాయ‌క్ తో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. ఇందులో రాజ‌మౌళి మాత్రం సూప‌ర్ స్టార్ తో సినిమా ఉంటుంద‌ని బ‌ల్ల‌గుద్ది చెబుతున్నాడు. కానీ వినాయ‌క్ మాత్రం ఇప్పుడు అప్పుడూ అంటున్నాడే కానీ ఎప్పుడో క్లారిటీగా చెప్ప‌ట్లేదు. ఇప్పుడు మ‌రోసారి వినాయ‌క్, మ‌హేశ్ కాంబినేష‌న్ పై వార్త‌లు వ‌చ్చాయి. త‌న‌కు మ‌హేశ్ తో సినిమా చేయాల‌ని కొన్నాళ్ల నుంచి చెబుతూనే ఉన్నాడు వినాయ‌క్. కానీ దానికి క‌థ.. టైమ్ రెండూ కుద‌ర‌డం లేదు. ఆ మ‌ధ్య అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసాడు కూడా. అయినా కానీ కార్య‌రూపం దాల్చ‌లేదు. తాను ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేశ్ సినిమాకు క‌థ అనుకోలేద‌ని.. కానీ చేస్తే మాత్రం అలాంటిలాంటి సినిమా కాదు.. బాక్సులు బ‌ద్ద‌లైపోయే సినిమా చేస్తానంటున్నాడు ఈ మాస్ డైరెక్ట‌ర్.

గ‌తంలో కూడా మ‌హేశ్ బాబు సినిమా గురించి మ‌న‌సులో మాట చెప్పాడు వినాయ‌క్. ఆయ‌న‌తో ఏకంగా 100 కోట్ల సినిమా చేయాల‌ని ఉంద‌న్నాడు వినాయ‌క్. ప్ర‌స్తుతం సాయిధ‌రంతేజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు వినాయ‌క్. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రోవైపు మ‌హేశ్ ఇప్పుడు కొర‌టాల సినిమాతో పాటు వంశీ పైడిప‌ల్లి సినిమాకు క‌మిట‌య్యాడు. వ‌చ్చే ఏడాది మ‌హేశ్, వినాయ‌క్ సినిమా క‌న్ఫ‌ర్మ్ అనుకున్న టైమ్ లో.. ఇప్పుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్, వరుణ్ తేజ అడ్డు ప‌డుతున్నారు ఈ కాంబినేష‌న్ కు. సాయి ధరమ్ తేజ్ సినిమా తర్వాత నల్లమలుపు బుజ్జి నిర్మాతగా సినిమా కంఫర్మ్ చేసాడు వినాయక్. కానీ హీరో విషయంలో ఓ క్లారిటీ రావట్లేదు. బెల్లంకొండ శ్రీనివాస్, వరుణ్ తేజ్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు ఆ ఎవరో ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఈ సినిమా తర్వాత అయినా మహేష్ తో సినిమాను వినాయ‌క్ లైన్ లోకి తీసుకొస్తాడా?