ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఉన్నా వెన‌క‌బ‌డుతున్నాడు..

హిట్ వ‌స్తేనే వాళ్ల ఆనందానికి హ‌ద్దుండ‌దు. ఇక తొలి సినిమాయే సూప‌ర్ హిట్ అయితే వాళ్ల కోసం స్టార్స్ గాళం వేయాల్సిందే. కానీ అదేం విచిత్ర‌మో గానీ.. ఇండ‌స్ట్రీలో కొంద‌రు ద‌ర్శ‌కులు మాత్రం అదృష్టానికి ఆమ‌డ దూరంలో బ‌తుకుతున్నారు. వాళ్లంతా తొలి సినిమాతో హిట్ కొట్టిన‌వాళ్లే. అయినా స‌రే.. మ‌రో సినిమా కోసం ఏళ్ల‌కేళ్లు వేచి చూడాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఇప్పుడు విరించి వ‌ర్మ‌నే తీసుకుందాం.. ఈ కుర్ర ద‌ర్శ‌కుడి తొలి సినిమా ఉయ్యాలా జంపాలా. అది కూడా సురేష్ బాబు, అక్కినేని బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన సినిమా. పైగా సినిమా హిట్టు. ఇక రెండో సినిమా మ‌జ్ను కూడా బాగానే ఆడింది.

ఇన్ని ప్ల‌స్ పాయింట్స్ ఉండి కూడా ఇప్ప‌టికీ మూడో సినిమాపై స‌స్పెన్స్ మెయింటేన్ చేస్తున్నాడు విరించి వ‌ర్మ‌. ఈ ద‌ర్శ‌కుడి మూడో సినిమా నాగ‌చైత‌న్య‌తో ఉండే అవ‌కాశం ఉంది. అక్కినేని వార‌సుడి కోసమే క‌థ సిద్ధం చేస్తున్నాడు విరించి. సింపుల్ ల‌వ్ స్టోరీస్ తీయ‌డంలో విరించి ఆక‌ట్టుకుంటున్నాడు. పైగా ప్రేమ‌క‌థ‌కు అక్కినేని హీరో పెట్టింది పేరు. కీర్తి కంబైన్స్ బ్యాన‌ర్ పై ఎల్ ఎల్ కుమార్ చౌద‌రి.. ప‌ద్మజ పిక్చ‌ర్స్ విరించి మూడో సినిమాను సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య చందూమొండేటి స‌వ్య‌సాచితో పాటు మారుతి సినిమాకు కూడా క‌మిట్ అయ్యాడు. మ‌రి ఈ రెండు సినిమాల త‌ర్వాత చైతూ సినిమా ఉంటుందా.. లేదంటే విరించి అంత గ్యాప్ ఎందుకని మ‌రో హీరోతో స‌ర్దుకుపోతాడా అనేది తెలియాలి.

 Follow US