కుర్రాడు నంద‌మూరి హీరోతోనా..?

Last Updated on by

ఇండ‌స్ట్రీలో హిట్ వ‌స్తే చాలు.. ఇంకేదాంతో ప‌నిలేదు. ద‌ర్శ‌కులు అయితే ఒక్క హిట్ కొడితే హీరోలే వెంట‌ప‌డ‌తారు. నిర్మాత‌లైతే అడ్వాన్సుల‌తో ఇంటి ముందు నిల‌బ‌డ‌తారు. కానీ అదేం విచిత్ర‌మో.. వ‌ర‌స‌గా రెండు విజ‌యాలు అందుకున్న విరించి వ‌ర్మ‌కు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు అలా జ‌ర‌గ‌లేదు. ఈయ‌న తెర‌కెక్కించిన రెండు సినిమాలు బాగానే ఆడాయి. ఈ కుర్ర ద‌ర్శ‌కుడి తొలి సినిమా ఉయ్యాలా జంపాలా. అది కూడా సురేష్ బాబు, అక్కినేని బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన సినిమా. పైగా సినిమా హిట్టు. ఇక రెండో సినిమా మ‌జ్ను కూడా బాగానే ఆడింది. ఇన్ని ప్ల‌స్ పాయింట్స్ ఉండి కూడా ఇప్ప‌టికీ మూడో సినిమాపై స‌స్పెన్స్ మెయింటేన్ చేస్తున్నాడు విరించి వ‌ర్మ‌. ఇన్నాళ్ల‌కు ఉగాది సంద‌ర్భంగా ఈ కుర్ర ద‌ర్శ‌కుడి మూడో సినిమాపై క్లారిటీ వ‌చ్చింది. క‌ళ్యాణ్ రామ్ హీరోగా విరించి వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నాడు. మ‌జ్ను సినిమాను నిర్మించిన జెమిని కిర‌ణ్ ఈ సినిమాను కూడా నిర్మించ‌బోతున్నారు. తాజాగా ఈ చిత్రంపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే సినిమా ప్ర‌మోష‌న్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ సాధినేనితో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ఈ హీరో. ఇప్ప‌టికే ఈయ‌న న‌టిస్తోన్న నా నువ్వే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. దాంతో ఇప్పుడు ప‌వ‌న్.. విరించి సినిమాల‌తో బిజీ కానున్నాడు. సింపుల్ ల‌వ్ స్టోరీస్ తీయ‌డంలో విరించి ఆరితేరి పోయాడు. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ తో ఎలాంటి క‌థ చేస్తాడో అని ఇప్ప‌ట్నుంచే ఆస‌క్తిగా చూస్తున్నారు ప్రేక్ష‌కులు.

User Comments