ఇప్పట్లో నీ కల నెరవేరేనా..?

Last Updated on by

అవును.. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నేళ్లైంది.. ఎన్నో సూప‌ర్ హిట్లు.. బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చాడు.. ఇండ‌స్ట్రీ హిట్ కూడా కొట్టాడు వినాయ‌క్. కానీ ఒక్క మ‌హేశ్ బాబుతో మాత్ర‌మే ఈయ‌న సినిమా చేయ‌లేక‌పోతున్నాడు. మ‌హేశ్ తో సినిమా చేయాల‌ని కొన్నాళ్ల నుంచి చెబుతూనే ఉన్నాడు వినాయ‌క్. కానీ దానికి క‌థ.. టైమ్ రెండూ కుద‌ర‌డం లేదు. ఆ మ‌ధ్య తాను మ‌హేశ్ సినిమా చేస్తున్నాన‌ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసాడు కూడా. అయినా కానీ కార్య‌రూపం దాల్చ‌లేదు. దానికి కార‌ణం క‌థ లేక‌పోవ‌డ‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది హీరోల‌కు క‌థ‌లు సిద్ధం చేయిస్తున్నాడు కానీ మ‌హేశ్ ద‌గ్గ‌రికి వ‌చ్చేసరికి మాత్రం క‌థ సిద్ధం కావ‌డం లేదు. ఈ విష‌యాన్ని వినాయ‌క్ కూడా ఇప్పుడు అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసాడు. త‌న‌కు కూడా మ‌హేశ్ బాబుతో సినిమా చేయాల‌ని ఉంద‌ని.. కానీ ఏం చేస్తాం క‌థ మాత్రం దొర‌క‌డం లేద‌న్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఇంటిలిజెంట్ ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్న ఈ ద‌ర్శ‌కుడు మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేశ్ సినిమాకు క‌థ అనుకోలేద‌ని.. కానీ చేస్తే మాత్రం అలాంటిలాంటి సినిమా కాదు.. బాక్సులు బ‌ద్ద‌లైపోయే సినిమా చేస్తానంటున్నాడు ఈ మాస్ డైరెక్ట‌ర్. మ‌హేశ్ తో చేస్తే ఏకంగా 100 కోట్ల సినిమా చేయాల‌ని ఉంద‌న్నాడు వినాయ‌క్. అయితే అది ఇప్ప‌ట్లో ఉండేలా క‌నిపించ‌ట్లేదు. క‌థ కుదిర్తే కానీ మ‌హేశ్ సినిమా సెట్ అవ్వ‌ద‌ని.. అయితే ఇప్పుడు కాక‌పోయినా త‌ర్వాతైనా ఖచ్చితంగా తాను సూప‌ర్ స్టార్ తో సినిమా చేసి తీరుతానంటున్నాడు వినాయ‌క్. కానీ ఈ లోపు అదుర్స్ 2 కూడా చేస్తానంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఎన్టీఆర్ కెరీర్ లో అదుర్స్ ఓ ప్ర‌త్యేక చిత్రం. ఇందులో చారి పాత్ర‌లో క‌డుపులు చెక్క‌లు చేసాడు ఈ హీరో. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో అనుకుంటున్నాడు వినాయ‌క్. అయితే ఈ సీక్వెల్ పై ఎన్టీఆర్ మాత్రం కాస్త అనాస‌క్తిగా ఉన్నాడు. అదుర్స్ లాంటి సినిమా మ‌ళ్లీ రాద‌ని అలాంటి సినిమాను చెడ‌గొట్ట‌డం త‌న‌కు ఇష్టం లేదంటున్నాడు ఈ హీరో. అయితే విన‌య్ అన్న మంచి క‌థ‌తో వ‌స్తే చేయ‌డానికి త‌న‌కేం అభ్యంత‌రం లేదంటూ ద‌ర్శ‌కుడికి వ‌దిలేసాడు జూనియ‌ర్. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. త్రివిక్ర‌మ్ సినిమాతో పాటు కొర‌టాల సినిమాకు కూడా క‌మిట‌య్యాడు ఎన్టీఆర్. మ‌రి ఇంత బిజీలో అదుర్స్ 2కు రెక్క‌లొస్తాయో..?

User Comments