రాజ‌కీయాల్లోకి వివి వినాయ‌క్..

Last Updated on by

అవును.. ఖచ్చితంగా ఇలాంటిదేదో జ‌రుగుతుంది ఇప్పుడు. వినాయ‌క్ తీరు ఇదివ‌ర‌క‌టి మాదిరి లేదు. ఖచ్చితంగా ఈయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చేలా క‌నిపిస్తున్నాడు. ఇంటిలిజెంట్ ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగిన తీరు చూసిన త‌ర్వాత వినాయ‌క్ సినిమా మ‌నిషిలా అయితే క‌నిపించట్లేదు. ఆయ‌న వెన‌క పెద్ద సైన్య‌మే ఉంది. త‌న బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చూపించుకోడానికే సొంతూళ్లో ఈ వేడుక పెట్టించాడా అనే అనుమానం కూడా లేక‌పోలేదు. అక్క‌డికి వ‌చ్చిన వాళ్ళంతా హీరో సాయిధ‌రంతేజ్ ను వ‌దిలేసి.. వినాయ‌క్ ను పొగిడేస్తున్నారు. స‌ప్త‌గిరి అయితే ఏకంగా వినాయ‌క్ రాజ‌కీయాల‌పై హింట్ కూడా ఇచ్చేసాడు. వినాయ‌క్ గారు సినిమాల్లోనే కాదు.. ఆయ‌న ఏ రంగంలోకి వెళ్లినా ఆయ‌న వెంటే మీరుంటార‌ని అర్థ‌మైంద‌ని చెప్పాడు. దాంతో వినాయ‌క్ కూడా షాక్ అయ్యాడు.

స‌ప్త‌గిరి మాత్ర‌మే కాదు.. అక్క‌డి జిల్లా రాజ‌కీయ నాయ‌కులు కూడా వినాయ‌క్ ను ఇన్ డైరెక్ట్ గా రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించారు. ఆయ‌న న‌డిచొస్తుంటే ఓ సింహం న‌డిచొస్తున్న‌ట్లు ఉంద‌ని.. ఆయ‌న లాంటి వాళ్లు సేవా రంగంలోనూ ఉండాల‌ని తెలిపారు అతిథులు. వినాయ‌క్ ఎలాంటి అడుగు వేసినా వెన‌క న‌డ‌వ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు కొంద‌రు. దీనికి వినాయ‌క్ కూడా న‌వ్వుతూ స‌మాధానం ఇచ్చారంతే. నిజానికి ఇండ‌స్ట్రీలో చాలా రోజులుగా వినాయ‌క్ సినిమాలు మానేస్తాడ‌నే టాక్ న‌డుస్తుంది. దీనికి పెద్ద‌గా కార‌ణాలు కూడా లేవు. ఆ మ‌ధ్య వ‌ర‌స‌గా ప‌రాజ‌యాలు ఎదుర‌వడంతో వినాయ‌క్ లో అస‌హ‌నం పెరిగింది. సినిమాలు చేయాలా వ‌ద్దా అనే డైల‌మాలో కూడా కొన్నాళ్లు ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే సినిమాల్లో వ‌చ్చిన డ‌బ్బుతో బ‌య‌ట బాగానే వెన‌కేసుకున్నాడు వినాయ‌క్. దాంతో ఇండ‌స్ట్రీ నుంచి పూర్తిగా సెల‌వు తీసుకునేందుకు వినాయ‌క్ సిద్ధ‌మ‌య్యాడ‌నే రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.

ఇవి న‌డుస్తుండ‌గానే ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆది టైమ్ లో కోటి రూపాయలు వ‌స్తే చాల‌నుకునేవాడు వినాయ‌క్. అప్ప‌ట్లో వ‌చ్చిన డ‌బ్బుతో బిజినెస్ చేసి బాగానే సంపాదించుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికీ కూడా వి కాంప్లెక్స్ పేరుతో ఆంధ్రాలో వినాయ‌క్ కు మ‌ల్టీప్లెక్సులు బాగానే ఉన్నాయి. వాటితోనే కావాల్సినంత సంపాదిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. పైగా సొంతూరికి చాలా సేవ‌లు చేస్తున్నాడు వినాయ‌క్. ఇదే అత‌డికి అక్క‌డ మంచి పేరు తీసుకొచ్చింది. రాజ‌కీయాల్లోకి ర‌మ్మంటూ ఆహ్వానించేలా చేస్తుంది. ఎవరు ఎన్ని అనుకొన్న మరి వినాయ‌క్ ఏం డిసైడ్ చేసుకొంటాడో చూడాలి.

User Comments