Directors Anil Ravipudi Shiva Nirvana Tweeted Next Hero Not Confirmed

కంగారు వ‌ద్దంటున్న‌ శివ‌.. అనిల్..

Directors Anil Ravipudi Shiva Nirvana Tweeted

తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న కుర్ర ద‌ర్శ‌కుల్లో ఆ ఇద్ద‌రు సంచ‌ల‌నాలే. ఒక‌రేమో వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకున్నాడు.. మ‌రొక‌రు తొలి సినిమా లోనే కావాల్సినంత కాంప్లికేటెడ్ క‌థ‌ను తీసుకుని మెప్పించాడు. ఆ ఇద్ద‌రూ అనిల్ రావిపూడి.. శివనిర్వాణ‌. రాజా ది గ్రేట్ తో అనిల్ రావిపూడి క్రేజ్ బాగానే పెరిగిపోయింది. ఈ కుర్ర ద‌ర్శ‌కుడి నెక్ట్స్ సినిమాపై ఆస‌క్తి పెరిగిపోయింది. దాంతో ఉండ‌బ‌ట్ట‌లేక వెబ్ మీడియాలో వార్త‌లు కూడా రాసేసారు. అనిల్ త‌ర్వాతి సినిమా హీరో వెంక‌టేశ్ అని.. డిసెంబ‌ర్ 13న ఈ చిత్ర ముహూర్తం జ‌ర‌గ‌బోతుంద‌ని రాసుకొచ్చారు. ఆ నోటా ఈ నోటా ప‌డి చివ‌రికి అది చేరాల్సిన వాళ్ల‌కు చేరిపోయింది. దాంతో స్పందించిన అనిల్.. త‌న త‌ర్వాతి సినిమాలో ఇద్ద‌రు హీరోలు ఉంటార‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌ర్నీ ఎంచుకోలేద‌ని క్లారిటీ ఇచ్చాడు. ద‌య‌చేసి చెప్పేవ‌ర‌కు ఆగండంటున్నాడు.

మ‌రోవైపు శివ‌నిర్వాణకు కూడా ఇదే స‌మ‌స్య వ‌చ్చింది. ఈయ‌న తొలి నిన్నుకోరి సూప‌ర్ హిట్. దాంతో సాధార‌ణంగానే రెండో సినిమాపై ఆస‌క్తి ఉంటుంది. దీనికి శివ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో ఈ కుర్ర ద‌ర్శ‌కుడి నెక్ట్స్ సినిమా వ‌రుణ్ తేజ్ తో అనే వార్త‌లొచ్చాయి. దాంతో శివ నిర్వాణే స్పందించాడు. తాను ఇంకా రెండో సినిమా ఎవ‌రితో చేయాల‌నే విష‌యంపై నిర్ణయం తీసుకోలేద‌ని.. క‌న్ఫ‌ర్మ్ అయిన త‌ర్వాత తానే చెప్తాన‌ని చెప్పాడు శివ‌. పైగా ఇప్పుడు క‌థ సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నాన‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. వీళ్లు మాత్ర‌మే కాదు.. హ‌రీష్ శంక‌ర్ కూడా త‌నతో దాగుడు మూత‌లు ఆడే హీరోలింకా దొర‌క‌లేద‌ని చెప్తున్నాడు. మొత్తానికి హీరోల విష‌యంలో కంగారు వ‌ద్దు.. చెప్పేవ‌ర‌కు ఆగండంటున్నారు కుర్ర ద‌ర్శ‌కులు.

కంగారు వ‌ద్దంటున్న‌ శివ‌.. అనిల్..
0 votes, 0.00 avg. rating (0% score)