డిస్కోరాజా ద‌ర్శ‌కుడితో క‌ళ్యాణ్‌రామ్‌

క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా ఈ యేడాది బిజీగా గ‌డ‌ప‌బోతున్నాడు. త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ తీయ‌బోయే సినిమాని హారిక హాసిని సంస్థ‌తో క‌లిసి నిర్మించ‌బోతున్నాడు. దాంతోపాటు మ‌రొక ఎన్టీఆర్ సినిమాని కూడా త‌న బ్యాన‌ర్‌లోనే తీయాల‌నేది క‌ళ్యాణ్ ఆలోచ‌న అట‌. అలా నిర్మాత‌గా ఎంత బిజీగా గ‌డ‌ప‌బోతున్నాడో… హీరోగా కూడా అదే రేంజ్‌లో సినిమాలు చేయ‌బోతున్నారు. వ‌రుస‌గా మూడు సినిమాల కోసం ఆయ‌న రంగం సిద్ధం చేసుకున్నారు.

విరించివ‌ర్మ‌, మ‌ల్లిడి వేణు… ఇలా ప‌లువురు ద‌ర్శ‌కులు క‌ళ్యాణ్ కోసం క‌థ‌లు సిద్ధం చేశారు. తాజాగా ఆ జాబితాలోకి మ‌రో ద‌ర్శ‌కుడు చేరాడు. ఆయ‌న డిస్కోరాజా దర్శ‌కుడు వి.ఐ.ఆనంద్‌. ఇటీవ‌లే క‌ళ్యాణ్‌రామ్‌కి వి.ఐ.ఆనంద్ క‌థ చెప్పాడ‌ట‌. అది ఆయ‌న‌కి బాగా న‌చ్చి వెంట‌నే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా వివ‌రాలు బ‌య‌టికొచ్చే అవ‌కాశాలున్నాయి. వి.ఐ.ఆనంద్ ప్ర‌తిభ‌గ‌ల ద‌ర్శ‌కుడు. డిస్కోరాజాని కూడా బాగానే తీశాడు కానీ… కొన్ని త‌ప్పిదాలు ఆయ‌న కొంప‌ముంచాయి. ఈసారి కూడా త‌న మార్క్ క‌థ‌తోనే స్క్రిప్టు సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం.