రాజాపై ద‌బాంగ్ దెబ్బ‌

మాస్ మ‌హారాజా రవితేజ ఫ్యాన్స్ కి స‌డెన్ షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. డిస్కో రాజా చిత్రాన్ని ఏకంగా నెల పాటు వాయిదా వేసి నిరుత్సాహ‌ప‌రిచాడు. వాస్త‌వ‌ విడుదల తేదీ డిసెంబర్ 20 అయితే వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ వాయిదా వెనుక అసలు కారణ‌మేంటి? అన్న‌ది ఆరాతీస్తే పోటీ చిత్రాల‌తో క‌లిసి రావ‌డం ఇష్టం లేక‌నే అని తెలుస్తోంది.

సాయి ధరమ్ తేజ్- మారుతీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతి రోజు పండుగే చిత్రంతో పాటు, బాలకృష్ణ నటించిన రూలర్ మూవీ కూడా డిసెంబ‌ర్ 20న‌ విడుదలవుతున్నాయి. ఈ తేదీని అంద‌రికంటే ముందే లాక్ చేసినా ర‌వితేజ ఎందుక‌నో వెన‌క్కి త‌గ్గాడు. రేసులో ఆ రెండు సినిమాల‌తో పాటే.. స‌డెన్ స్టార్ ప్ర‌వేశించాడు. బాలీవుడ్ కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 తెలుగు వర్షన్ కూడా డిసెంబ‌ర్ 20న‌ విడుదల చేస్తున్నారు. దీంతో మాస్ రాజా వెన‌క్కి త‌గ్గ‌డ‌మే క‌రెక్ట్ అని భావించార‌ట‌. ఎలానూ ద‌బాంగ్ 3ని రిలీజ్ చేస్తున్న‌ది డి.సురేష్ బాబు కాబ‌ట్టి థియేట‌ర్ల తంటా ఉంటుంది కాబ‌ట్టి ఇక రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింద‌ట‌.