దిశ కిరాత‌కుల ఎన్ కౌంట‌ర్

హైద‌రాబాద్ లో జరిగిన దిశ‌ దారుణ ఘటన యావత్తు భారతావనిని ఉలిక్కిప‌డేలా చేసింది. ప్రియాంక‌రెడ్డి హ‌త్యోదంతం జాతీయ స్థాయిలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఆరీఫ్,నవీన్, చెన్నకేశవులు మరియు శివ అనే నలుగురు కామాంధులు దిషా అనే ఓ వెటర్నరీ డాక్టర్ ను అత్యంత కిరాతహకంగా అత్యాచారం చేసి హతమార్చిన ఘటన కొద్దిరోజులుగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ఘ‌ట‌న‌లో నిందితుల్ని తక్షణం ఉరి శిక్ష వెయ్యకుండా రిమాండ్ .. ద‌ర్యాప్తు పేరుతో తాత్సారం చేస్తున్నారేమిటి? అంటూ జ‌నం కోపోద్రిక్తులు అయ్యారు.

అయితే ఎంతో ఉత్కంఠ న‌డుమ ఈ తీర్పు ఎలా ఉండ‌బోతోంది?  కోర్టుల ప‌రిధిలో న్యాయం జ‌రుగుతుందా? అంటూ ఎదురు చూస్తున్న ప్ర‌జ‌ల‌కు ఊహించ‌ని తీర్పుతో పోలీసులు సంచ‌ల‌నానికి తెర తీశారు. ఈ నలుగురు నిందితులను షాద్ నగర్ దగ్గర పోలీసులు ఈ రోజు తెల్లవారు జామున ఎన్ కౌంట‌ర్ చేశారు. అసలు ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగిందంటే వారిని రీ-కనస్ట్రక్షన్ చేసేందుకు తరలిస్తుండగా చటాన్ పల్లి వద్ద పారిపోయే ప్రయత్నం చెయ్యడమే కాకుండా వారు పోలీసులపై ఎదురుదాడి కూడా చెశార‌ట‌. దీంతో పోలీసులు అక్కడికక్కడే వారిని ఎన్కౌంటర్ చేసి లేపేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ వార్త విన్న వారంతా సంబరాలు చేసుకుంటున్నారు.