`భాఘి 3` సైర‌న్ ఇదిగో

Last Updated on by

గ‌త కొంత‌కాలంగా ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ నుంచి దిశా ప‌టానీ విడిపోయింద‌ని, ఆ ఇద్ద‌రి ప్రేమ బ్రేక‌ప్ అయ్యింద‌ని రెగ్యుల‌ర్ గా వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అవేవీ ప‌ట్టించుకోకుండా టైగ‌ర్ – దిశా ఇద్ద‌రూ కెరీర్ పైనే దృష్టి సారిస్తున్నారు. ఈ జోడీ న‌టించిన భాఘి 2 ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్ లో త‌దుప‌రి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. దిశా ఓ వీడియోని తాజాగా షేర్ చేసింది. `భాఘి 3` కోసం దిశా క‌ఠినంగా వ్యాయామాలు చేస్తూ మార్ష‌ల్ ఆర్ట్స్ ను నేర్చుకుంటోంది.

“నాతో మెస్ ఎందుకు? ప‌్ర‌స్తుతం ఇదిగో ఇలా శిక్ష‌ణ తీసుకుంటున్నా.. . మ్యాట్రిక్స్ అఫీషియ‌ల్ విత్ మై కోచ్‌. ది పాథ్ ఆఫ్ ది వారియ‌ర్.. టైగ‌ర్ జాకీష్రాఫ్‌.. కిష్సు ష్రాఫ్‌“ అంటూ ఓ కొటేష‌న్ ని ఇన్‌స్టాలో ఇచ్చింది. మొత్తానికి భాఘి 3 స‌న్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇదే వీడియోని టైగ‌ర్ ష్రాఫ్, సోన‌మ్ క‌పూర్, శిల్పా శెట్టి వంటి స్టార్లు సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేయ‌డం విశేషం. భాఘి 2తో 100కోట్ల క్ల‌బ్ హీరోగా సంచ‌ల‌నం సృష్టించిన ష్రాఫ్ బోయ్ రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమా భాఘి 3ని ప్రారంభించ‌నున్నాడు. అందుకే దిశా ఇలా ప్రీప్రాక్టీస్ చేస్తోంది. పార్ట్- 3లో కిక్ బాక్స‌ర్ గా దిశా మైమ‌రిపించ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

User Comments