లైట్ ఆరుతూ.. వెలుగుతూ మధ్యలో అమ్మాయి అందాలు చూపిస్తూ ఉంటే చూసే కళ్లు మాత్రం కుళ్లుకోకుండా ఎందుకు ఉంటాయి చెప్పండి..? పైగా అక్కడున్నది సింపుల్ బ్యూటీ కాదు.. దిశాపటానీ. అందాలన్నీ ఆరబోస్తూ రెచ్చగొట్టేస్తుంది ఈ లేడీ లోఫర్. ఈ మధ్యే భాగీ 2తో భారీ విజయం అందుకుంది దిశా. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లో దిశాకు ఆఫర్ల వెల్లువ సాగుతుంది. అవకాశాలు వచ్చినా రాకపోయినా.. తమ పని మాత్రం ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటమే. అది కూడా అందాల ఆరబోతతోనే. ఈ లిస్ట్ లో ఎప్పుడూ తాను ముందే ఉంటానని చెబుతుంది దిశాపటానీ.ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్ ను తూచా తప్పకుండా పాటిస్తుంది ఈ భామ. ఇప్పుడు పూమా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది దిశా. ఇందులో భాగంగానే బికినీ ఫోటోషూట్ తో మతులు చెడగొట్టేసింది. ఇక ఇప్పుడు మరోసారి దిశాపటానీ.. అందాల బాణం గుచ్చేసింది. ఈ సారి చిట్టిపొట్టి డ్రస్ లో థండరింగ్ థైస్ చూపిస్తూ చూపులు తిప్పుకోలేని విధంగా గుండెల్లో బాణాలు దించేస్తుంది. చెప్పుకోలేనంత.. దాచుకోలేనంత అందం ఉండి కూడా ఖాళీగా కూర్చుంటుంది దిశాపటానీ. ఈ భామకు బ్రేక్ ఇచ్చే దర్శకుడు ఎక్కడున్నాడో కానీ అప్పటి వరకు ఇలా అందాల ఆరబోత ఆపడం మాత్రం కష్టమే అంటుంది దిశాపటానీ. మొత్తానికి లేడీ లోఫర్ అందాలకు గూగుల్ తల్లి కూడా వేడెక్కిపోయి ఆగిపోతుందేమో..?
హాటెస్ట్ బ్రాండ్ అంబాసిడర్
