ఆటీను రాణీ.. పూరీ పాప హంగామా!

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో పుట్టిన హాట్ ఆట‌మ్ బాంబ్ దిషా ప‌టానీ. సినిమాల్లో కంటే ఎఫైర్‌లు..హాట్ హాట్ షోల‌తోనే ఎక్కువ‌గా పాపుల‌ర్ అవుతోంది. ఉత్త‌రాదిలో పుట్టిన ఈ ఆర‌డుగుల ఆటీను రాణీ పూరి జ‌గ‌న్న‌థ్ రూపొందించిన `లోఫ‌ర్‌` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. తొలి సినిమాతోనే కుర్ర‌కారు గుండెల్లో మంట‌పెట్టేసింది. `లోఫ‌ర్‌` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోయినా తెలుగులో ప్ర‌య‌త్నించ‌ని దిషా బాలీవుడ్‌ని ఆక‌ర్షించ‌డం మొద‌లుపెట్టింది.

ధోనీ బ‌యోపిక్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న దిషా ఆ త‌రువాత కెరీర్ ప‌ర‌గా వెనుతిరిగి చూసుకోలేదు. కెరీర్‌లో ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఆఫ‌ర్‌లు లేక‌పోయినా టైగ‌ర్ ష్రాఫ్‌తో ప్రేమాయ‌ణాన్ని సాగిస్తూ నిత్యం వార్త‌ల్లో నిలిచి యూత్‌కు హాట్ ఫేవ‌రేట్‌గా మారిపోయింది. అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టుగా లోదుస్తుల ప్ర‌చారం మొద‌లుపెట్టిన దిషా సోష‌ల్ మీడియాను వేడెక్కించేసింది. నిత్యం త‌న పోస్ట్‌ల‌తో ప్ర‌స్తుతం య‌వ‌త మ‌తులు పోగొడుతోంది. లోదుస్తుల్లో ఎలాంటి బిడియం లేకుండా పోజులిచ్చిన త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్, ట్వ‌ట్ట‌ర్‌ల‌లో పోస్ట్ చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా హంగామా సృష్టిస్తోంది.

దిషా సిల్వ‌ర్ స్ర్కీన్‌పై ఎప్పుడు క‌నిపిస్తుందా? అని చూసేవాళ్ల‌కంటే సోష‌ల్ మీడియాలో ఎలాంటి హాట్ పిక్‌ను ఈ రోజు…ఈ క్ష‌ణం పోస్ట్ చేస్తుందా? అని ఎదురుచూసే యూతే అత్య‌ధికంగా వున్నారంటే దిషా సోష‌ల్ మీడియాతో ఏ రేంజ్‌లో ఆడుకుంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. దిషా త‌న లుక్స్‌కు త‌గ్గ‌ట్టు ప‌ర్‌ఫెక్ట్ బాడీ వుండ‌టం కూడా యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. బీచ్ ఫోటోల‌తో.. సెక్సీ లుక్స్‌తో ఇంట‌ర్‌నెట్ లో మంట‌పెట్టేస్తున్న దిషా మానియాను ఆప‌డం ఇప్ప‌ట్లో ఎవ‌రి త‌ర‌మూ కాదు.