భాయ్ స‌ర‌స‌న లోఫ‌ర్ గాళ్‌

Last Updated on by

స‌ల్మాన్ ఖాన్ – అలీ అబ్బాస్ జాఫ‌ర్ కాంబినేష‌న్ మూవీ `టైగ‌ర్ జిందా హై` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. అభిమానుల‌ దాహం తీర్చిన సినిమా ఇది. ఆ క్ర‌మంలోనే ఈ జోడీ మ‌రో భారీ సినిమాకి స‌న్నాహాలు చేస్తోంది. ఓవైపు స‌ల్మాన్ భాయ్ `రేస్-3` షూటింగ్‌లో బిజీగా ఉంటూనే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప‌నులు సీరియ‌స్‌గా చ‌క్క‌బెడుతున్నాడు. ఇప్ప‌టికే `భ‌ర‌త్` అనే టైటిల్‌ని ప్ర‌క‌టించారు. ప్రియాంక చోప్రాని క‌థానాయిక‌గా ఎంపిక చేశారు.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. భాయ్ స‌ర‌స‌న ఒక‌రు కాదు.. ఇద్ద‌రు క‌థానాయిక‌లు.  ఆ రెండో నాయిక ఎవ‌రో తెలుసా?  `లోఫ‌ర్‌` బ్యూటీ దిశా ప‌టానీ. ఈ భామ కెరీర్ ప్ర‌స్తుతం స్వింగులో ఉంది. ఇటీవ‌లే బోయ్‌ఫ్రెండ్ టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న న‌టించిన `భాఘి 2` 100కోట్ల క్ల‌బ్ సినిమాగా రికార్డుల‌కెక్కింది. ఇంత‌లోనే క్రేజీగా స‌ల్మాన్ స‌ర‌స‌న ఛాన్స్ ప‌ట్టేసింది. ఇక స‌ల్మాన్ భాయ్ ఈ సినిమాతో పాటు `ద‌బాంగ్ 3`ని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నాడు. రేస్ 3, భ‌ర‌త్‌, ద‌బాంగ్ 3 .. ఇలా భాయ్‌కి ఈ లైన‌ప్ పెద్ద‌దే ఉంది

User Comments