ఫోటో: క‌పూర్ గాళ్స్ జోష్‌

Last Updated on by

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి పెద్ద కుమార్తె జాన్వీ ఇటీవ‌లే ధ‌డ‌క్ చిత్రంతో క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే చ‌క్కని న‌టి అన్న పేరు తెచ్చుకుంది. మామ్ పేరు నిల‌బెట్టింది. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న త‌క్త్ అనే చిత్రంలో న‌టించ‌నుంది. త‌దుప‌రి జాన్వీ సోద‌రి ఖుషీ క‌పూర్ సినీఆరంగేట్రానికి టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆ క్ర‌మంలోనే అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ ఇలా ఫేజ్ 3 ప్ర‌పంచంలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. న్యూ డిల్లీలో లూయ‌స్ వుట్ట‌న్ ష‌రూమ్ లాంచ్ కార్యక్రమంలో ఈ భామ‌లిద్ద‌రూ ఇలా ఫోజులిచ్చారు.

User Comments