చైత‌న్య ప్రేమికురాలిగా నా `మ‌జిలీ`! – దివ్యాంశ కౌశిక్

Last Updated on by

నాగ‌చైత‌న్య – స‌మంత జంట‌గా న‌టిస్తున్న చిత్రం మ‌జిలీ. దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌ధారి. న‌టించిన‌ శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. షైన్ స్కీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 5న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా క‌థానాయిక‌ దివ్యాంశ కౌశిక్‌తో చిట్ చాట్..

మీ నేప‌థ్యం?
దిల్లీ నా స్వ‌స్థ‌లం. మూడేళ్లుగా ముంబైలో ఉంటున్నా. న‌ట‌ శిక్ష‌ణ తీసుకుని సినిమాల్లో ప్ర‌య‌త్నించాను. ఆడిష‌న్స్‌కు వెళ్లేదాన్ని. అలా మ‌జిలీ సినిమాకు ఎంపిక‌య్యాను. నా కెరీర్ తొలి చిత్రం త‌మిళంలో సిద్ధార్థ్ స‌ర‌స‌న చేస్తున్నాను. అది మే లేదా జూన్‌లో విడుద‌ల కానుంది. తెలుగులో మ‌జిలీ నా తొలి చిత్రం. ముంబైలో శిక్ష‌ణ స‌మ‌యంలో వ‌ర్క్‌షాప్స్‌లో పాల్గొన్నాను. ఫెయిర్ అండ్ ల‌వ్ లీ, పాన్‌టీన్ షాంపు, హీరో హోండా బైక్ వంటి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించాను.

మ‌జిలీలో మీ రోల్‌?
నా పాత్ర పేరు అన్షు. చైత‌న్య‌ను ప్రేమించే అమ్మాయిగా క‌నిపిస్తాను. ఇంత కంటే వివ‌రం చెప్ప‌లేను.

చైత‌న్య‌తో ఆన్ లొకేష‌న్ అనుభ‌వం?
చాలా హ్య‌పీ. అమేజింగ్ కోస్టార్‌. ఎదిగినా ఒదిగి ఉండే స్వ‌భావం ఉన్న హీరో.

తెలుగు భాష‌.. న‌ట‌న క‌ష్టం కాదా?
తెలుగు కొంతవ‌ర‌కూ అర్థ‌మ‌వుతుంది. కానీ… మాట్లాడ‌లేను. త‌మిళ్ కంటే తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తిదీ సులువు. ఇక్కడ యూనిట్ సాయం ఉంటుంది.

స‌మంత‌తో స‌న్నివేశాల్ని షేర్ చేసుకున్నారా?
న‌టిగా స‌మంత అంటే ఇష్టం. ఆమెతో క‌లిసి న‌టించే స‌న్నివేశాలు మ‌జిలీలో లేవు.

ద‌ర్శ‌కుడు శివ నిర్మాణ గురించి?
నా ద‌ర్శ‌కుడు నాకు ఎంత‌గానో అండ‌గా నిలిచారు. ఆయ‌న ఇచ్చిన స్వేచ్ఛ‌తోనే బాగా న‌టించాను. డైరెక్ట‌ర్‌గా న‌న్ను గైడ్ చేయ‌డ‌మే కాకుండా నాలో కాన్ఫిడెన్స్‌ను పెంచారు.

చై, సామ్ భార్యాభ‌ర్తలు క‌దా… వారితో న‌టించ‌డం ఏమ‌నిపించింది?
స‌మంత నా స్ఫూర్తి. చైత‌న్య – స‌మంత‌తో క‌లిసి న‌టించ‌డం గొప్ప‌గా భావిస్తున్నా. వారు పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టించారు. అలాగే చై- సామ్ జంట‌గా న‌టించిన‌ ఏమాయ చేసావె సినిమా చూశాను. నాకు చాలా న‌చ్చింది. తెలుగులో
అర్జున్ రెడ్డి, నిన్నుకోరి చిత్రాలు చూశాను. స‌మంత‌ న‌టించిన ఈగ హిందీ అనువాదం చాలా సార్లు చూశాను.

ఏ త‌ర‌హా సినిమాలు చేయాల‌నుకుంటున్నారు?
నా పాత్ర తీరు తెన్నులు, పాత్ర గ్రాఫ్ నాకు న‌చ్చింది. అందుక‌నే న‌టించాను. కంటెంట్ ఉన్న సినిమాలే కాదు.. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి కూడా సిద్ధంగా ఉన్నాను.

మ‌జిలీ సినిమా లోగుట్టు?
– మ‌జిలీ ఫ్యామిలీ డ్రామా. ద‌ర్శ‌కుడు సినిమాను అద్భుతంగా మ‌లిచారు. చిన్న చిన్న స‌న్నివేశాల‌ను కూడా అద్భుతంగా మ‌లిచారు. ప్ర‌తిరోజూ మ‌నం ఫేస్ చేసే విష‌యాల‌ను కూడా చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. ఇక ఈ చిత్రంలో నా పాత్ర‌కు చ‌క్క‌ని ప్రాధాన్య‌త ఉంది.

మీ స్ఫూర్తి ఎవ‌రు?
– బాలీవుడ్‌లో ఆలియా భ‌ట్, క‌రీనా క‌పూర్‌, అనుష్క శ‌ర్మ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌తాను. ఇక్క‌డ స‌మంత న‌ట‌నంటే ఇష్టం.

త‌ర్వాత చేయ‌బోతున్న చిత్రాలు?
– కొన్ని చిత్రాలు చ‌ర్చ‌ల‌ ద‌శ‌లో ఉన్నాయి.

Also Read : Bichagadu Turned As Killer

User Comments