గాడ్‌! డీజే బ్యూటీ అలా లాకైంది!

Last Updated on by

డీజేలో బ‌న్ని స‌ర‌స‌న వెడెక్కించే పెర్ఫామెన్స్ చేసింది  పూజా హెగ్డే. ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీ‌నివాస్ స‌ర‌స‌న `సాక్ష్యం` సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే రిలీజ్‌కి రానుంది. ప‌నిలో ప‌నిగా బిజీ షెడ్యూల్స్‌తో సెట్స్‌లో ఉండ‌గానే మ‌రో మూడు క్రేజీ ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేసింది. అస‌లు రాబోవు కొన్ని నెల‌లు ఖాళీ అన్న‌దే ఉండ‌దు… మునుముందు ఏం ఛాలెంజ్‌.. ఉందో.. ఏం అడ్వెంచ‌ర్ ఉందో అన్న కంగారులోనూ ఉంది అమ్మ‌డు. ప్ర‌భాస్‌- రాధాకృష్ణ చిత్రం, ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్ మూవీ, మ‌హేష్- వంశీ పైడిప‌ల్లి మూవీ .. ఇవ‌న్నీ పూజా ఖాతాలో ప‌డ్డాయి. వ‌రుస‌గా ఈ ముంబై బొమ్మ‌ని అగ్ర నిర్మాణ సంస్థ‌లు లాక్ చేసేశాయి. వీటితోపాటే బాలీవుడ్‌లో క్రేజీగా `హౌస్‌ఫుల్ 4` చిత్రంలోనూ అవ‌కాశం అందుకుంది హెగ్డే గాళ్‌.
మునుముందు ఇంత భారీ షెడ్యూల్ ఉంది కాబ‌ట్టి.. కొన్ని నెల‌ల పాటు అస‌లు నేను మీకు క‌నిపిస్తానో లేదో! అన్న సందేహాన్ని వ్య‌క్తం చేసింది పూజా. “ఇప్ప‌టికి సెల‌వులో ఉన్నా… రాబోవు నెల‌ల్లో పూర్తి బిజీ అయిపోతున్నా. అన్నీ సాహ‌సాలే ఇక మీద‌ట‌. భ‌విష్య‌త్ అంతా ఎగ్జ‌యిటింగ్‌గా.. ఛాలెంజింగ్‌గా ఉంటుంది. పూర్తి ప‌ని వాతావ‌ర‌ణంలోకి వ‌చ్చేస్తున్న‌ట్టే. ప‌ని ప‌ని ప‌ని ప‌ని ప‌ని.. !“ అంటూ ట్వీట్ చేసింది పూజా హెగ్డే. ఓ మైగాడ్ పూజా.. ఈ రేంజులో వ‌ర్క్ షెడ్యూల్స్‌తో బ్లాక్ అవుతుంద‌ని అనుకోలేదెవ‌రూ!

User Comments