డీజే బ్యూటీ బాప్‌రే!

Last Updated on by

డీజే బ్యూటీ షాకింగ్ ట్విస్ట్ చూశారా? ఉన్న‌ట్టుండి అలా దేవ‌త‌లా ప్ర‌త్య‌క్ష‌మైంది. అది కూడా పాత స్నేహితులు బ‌న్ని, హ‌రీష్ శంక‌ర్‌ల‌తో రీయునైట్ అయ్యింది. ఆ సంగ‌తిని త‌నే సంబ‌రంగానూ చెప్పుకుంటోంది. “అనుకోకుండానే క‌లిశాం. స‌రిగ్గా ఏడాది అయ్యింది క‌లిసి. మా గ్రూప్‌లోకి .. న‌వ్వులకు ఆహ్వానం“ అని సంబ‌రంగా చెప్పుకుంది ఈ భామ‌. అంతా బాగానే ఉంది కానీ.. ఇలా పాత స్నేహితుల‌ను కొత్త‌గా క‌లుసుకునేంత స‌మ‌యం ఈ అమ్మ‌డికి ఎలా చిక్కింది? అంటే మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ అంటోంది.

ఓవైపు తార‌క్ స‌ర‌స‌న న‌టిస్తూనే, వేరొక వైపు ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది. అలానే మ‌హేష్ స‌ర‌స‌న వంశీ పైడిప‌ల్లి సినిమాలోనూ ఈ భామ న‌టించ‌నుంది. ఇంత బిజీలోనూ ఇలా త‌న పాత స్నేహితుల్ని క‌లుసుకుని సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ముంబై బ్యూటీ పూజాలోని క‌లివిడిత‌నం.. మ‌న ద‌ర్శ‌క‌హీరోల‌కు పిచ్చిగా న‌చ్చేస్తోంది. అందుకే టాలీవుడ్‌లో ఈ అమ్మ‌డు ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను సినిమాలు సునాయాసాంగా చేసేసింది. తెలివైన గ‌డుగ్గాయ్!

User Comments