క‌మ్ముల కొత్త హీరో ఎవ‌రో?

Last Updated on by

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ అనేది ఒక‌టి ఉంది. అది ఏ ఇత‌ర జోన‌ర్‌ల‌కు సంబంధించిన జోన‌ర్ కానేకాదు. అతడికంటూ ఓ స్టైల్ ఉంది. అందులో ఎమోష‌న్ గొప్ప‌గా ఉంటుంది. సినిమా స‌హ‌జంగా ఉంటుంది. కానీ అందులో మాస్ ఎలిమెంట్స్ ప‌రిమితం. స‌హ‌జ‌త్వం, రియాలిటీ ఆక‌ట్టుకుంటాయి. ఇక‌పోతే పాట‌లు కూడా క‌మ్ముల జోన‌ర్‌లోనే ఉంటాయి. అవి మెలోడీతో స్లోఫేస్‌లో సాగే క‌మ్ముల బాడీ లాంగ్వేజ్‌లానే పాట‌లు ఉంటాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే శేఖ‌ర్‌క‌మ్ముల‌కు హ్యాపీడేస్‌, ఫిదా లాంటి జోన‌ర్‌లు త‌ప్ప ఇంకే జోన‌ర్ సూట్ కావా? అన్నంత‌గా ఇమేజ్, ముద్ర ప‌డిపోయింది. మ‌రి ఇలాంట‌ప్పుడు క‌మ్ముల ఇతర స్టార్ డైరెక్ట‌ర్ల లీగ్‌లోకి చేరే అవ‌కాశ‌మే లేదా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. అత‌డు ఒక పూరి జ‌గ‌న్నాథ్ కాలేడు. కొర‌టాల‌, క్రిష్ అస‌లే కాలేడు. మ‌రి ఇక్క‌డ ఎవ‌రికి వారే గొప్ప‌. క‌మ్ముల ఫిదా లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ తీశాడు కాబ‌ట్టి, అత‌డి ప‌ప్పులు ఉడొకొచ్చేమో.. కానీ శాశ్వ‌తంగా ఉడ‌కాలి క‌దా? ఇదొక్క సందేహం మాత్రం అతడి అభిమానుల‌కు కూడా ఉంది.

ఎప్పుడూ అవే స్లోఫేస్ సినిమాలు క‌ష్టం. ఇది సీజ‌న‌ల్ మాత్ర‌మే.. అన్న సందేహౄలు ఉన్నాయి. అయితే క‌మ్ముల సీజ‌న్ ఎంత‌వ‌ర‌కూ? ఎమోష‌న్స్ అత‌డికి సాయం ఎంత‌వ‌ర‌కూ? అన్న‌ది చూడాలి. ఇక‌పోతే మాస్ అప్పీల్ లేక‌పోతే కొంత‌కాల‌మే ఇక్క‌డ‌. పెద్ద స్థాయి ఎదుగుద‌ల ఉండ‌దన్న సందేహాలున్నాయి. వ‌చ్చే నెల‌లో క‌మ్ముల కొత్త సినిమా ప్రారంభమ‌వుతోంది. కొత్త హీరోని ప‌రిచ‌యం చేస్తున్నార‌ట‌. అయితే క‌మ్ముల అత‌డిని ఎలా చూపిస్తారో? త‌న‌దైన సెన్సిబిలిటీస్‌కి సూట‌య్యే హీరోనే వెతుక్కుని ఉంటాడు. అత‌గాడు మాస్ అప్పీల్ ఉన్న‌వాడైతే ఎలా ఉంటుందో చూడాలి. క‌మ్ముల ఈసారి కూడా సొంత బ్యాన‌ర్‌లోనే సినిమా చేస్తున్నాడు.

User Comments