ప్రభాస్ సాహో డబ్బింగ్ రైట్స్ 120 కోట్లు

Last Updated on by

ఒక్క సినిమాతో కెరీర్ మారిపోతుంది అంటారు. కానీ అది చెప్పినంత ఈజీ కాదు. చాలా మందికి అది జ‌ర‌గ‌దు. కానీ ప్ర‌భాస్ విష‌యంలో జ‌రిగింది. బాహుబ‌లి అనే ఒకే ఒక్క సినిమా ప్ర‌భాస్ జాత‌కం మార్చేసింది. కానీ ఇంత‌లా ట‌ర్న్ అవుతుంద‌నీ ఆయ‌న కూడా ఊహించి ఉండ‌డు. ఈ చిత్రంతో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయిపోయాడు ప్ర‌భాస్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్.. ఇలా ఇండియాలోని అన్ని దిక్కుల్లోనూ ఇప్పుడు ప్ర‌భాస్ సూప‌ర్ స్టార్. ఈయ‌న సిక్స్ ఫీట్ క‌టౌట్ కు ఇప్పుడు బాలీవుడ్ లోనూ పూజ‌లు చేస్తున్నారు. ఈయ‌న ఛాన్సిస్తే ఎగ‌రేసుకుపోదామ‌ని చాలా మంది వేచి చూస్తున్నారు. క‌ర‌ణ్ జోహార్ అయితే మూడేళ్లుగా కాచుక్కూర్చున్నాడు. ఈయ‌న ప్ర‌భాస్ తో సినిమా చేయ‌డానికి చాలా కాలంగా పావులు క‌దుపుతున్నాడు. బాలీవుడ్ లో బాహుబ‌లి సినిమాను ఆ స్థాయికి తీసుకెళ్లడానికి సహాయ పడింది ఈయనే.

బాహుబ‌లి తెచ్చిన ఇమేజ్ క్యాష్ చేసుకుంటూ.. ప్ర‌భాస్ కూడా జాగ్ర‌త్త‌గా ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఈయ‌న చేస్తోన్న సాహో సినిమాపై కూడా బాలీవుడ్ లో భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్ర రైట్స్ ఏకంగా 120 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. ఇది ఇప్పుడు ఓ సంచ‌ల‌నం. ఓ ద‌క్షిణాది సినిమాకు ఇంత రేట్ పెట్టి కొన‌డం అంటే మాట‌లు కాదు. ర‌జినీకాంత్ వ‌ల్లే కాలేదు ఇప్పుడు ప్ర‌భాస్ మాత్రం బాలీవుడ్ లో జెండా పాతేలా క‌నిపిస్తున్నాడు. సుజీత్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే స‌గానికి పైగా పూర్త‌యింది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో శ్ర‌ద్ధాక‌పూర్ తో పాటు చాలా మంది బాలీవుడ్ న‌టులే ఉన్నారు. దాంతో సినిమాపై అక్క‌డ కూడా అంచ‌నాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు బాహుబ‌లి ఎఫెక్ట్ ఎలాగూ ఉండ‌నే ఉంది.

మ‌రోవైపు ప్ర‌భాస్ తో సినిమాలు చేయ‌డానికి బాలీవుడ్ నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నారు. ప్ర‌భాస్ తో రెండు సినిమాలు చేయ‌డానికి క‌ర‌ణ్ జోహార్ డీల్ కుదుర్చుకున్నాడ‌ని ఆ మ‌ధ్య వార్త‌లొచ్చాయి. కానీ ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌తో విడిపోయార‌ని.. ఇప్ప‌ట్లో ప్ర‌భాస్ హిందీలో సినిమా చేయ‌డ‌ని తెలుస్తుంది. కాక‌పోతే త‌న బాలీవుడ్ ఎంట్రీ క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఈ హీరో మూడేళ్ల కిందే ఓ ప్రేమ‌క‌థ విన్నాడు. ఇప్పుడు తాను ఒప్పుకున్న సినిమాల‌న్నీ పూర్తైన త‌ర్వాత దాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. బాహుబ‌లితో వ‌చ్చిన ఇమేజ్ అంత ఈజీగా వ‌దిలేయ‌కూడ‌ద‌నేది ప్ర‌భాస్ ఆలోచ‌న‌. అన్నీ కుదిర్తే తెలుగు సినిమాల కంటే ఎక్కువ‌గా బాలీవుడ్ పైనే ఫోక‌స్ చేయాల‌ని చూస్తున్నాడు. దానికోస‌మే హిందీ కూడా నేర్చుకుంటున్నాడు ప్ర‌భాస్. ప్ర‌స్తుతం సుజీత్ సాహోతో పాటు జిల్ ఫేమ్  రాధాకృష్ణ‌తో సినిమా క‌మిట‌య్యాడు ప్ర‌భాస్. ఈ రెండు సినిమాలు హిందీలోనూ అనువాదం అవుతాయి.

User Comments