పాల‌కొల్లులో దాస‌రి విగ్ర‌హం

శతాధిక చిత్ర దర్శకులు కీర్తిశేషులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ మహోత్సవం ఈనెల 26న పాల‌కొల్లులో జ‌ర‌గ‌నుంది. దాసరి విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ వేడుక‌ జరగనుంద‌ని తెలుస్తోంది. చలనచిత్ర, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దాసరి నారాయణరావు ప్రియ శిష్యులు, సుప్రసిద్ధ నటులు, నిర్మాత, విద్యావేత్త డాక్టర్ మంచు మోహన్ బాబు విగ్రహావిష్కరణ కర్తగా పాల్గొంటున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఆధ్వర్యంలో దాసరి సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుంది. దాసరి అభిమానులు, శిష్యులు,కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్ ల ట్రెండ్ కొన‌సాగుతోంది. ఇదివ‌ర‌కూ దాస‌రి బ‌యోపిక్ పైనా ప్ర‌క‌టించారు. కానీ ఇంత‌వ‌ర‌కూ దానికి సంబంధించిన అప్ డేట్ రాక‌పోవ‌డంపై అభిమానుల్లో నిరాశ త‌ప్ప‌లేదు. దీనిపై ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ప్ర‌క‌టిస్తార‌ని భావిస్తున్నారు.