పాపం ప్రభాస్ కు దుబాయ్ కష్టాలు

Last Updated on by

దుబాయ్ అంటే ఇప్పుడు కేరాఫ్ శ్రీ‌దేవి అయిపోయింది. అక్క‌డ ఆమె చ‌నిపోవ‌డంతో దుబాయ్ పేరు ఇండియాలో మారుమోగిపోతుంది. ఇకిప్పుడు ప్ర‌భాస్ కు కూడా దుబాయ్ షాకులు త‌గులుతున్నాయి. ఈయ‌న న‌టిస్తున్న సాహో సినిమా షూటింగ్ దుబాయ్ లో ప్లాన్ చేసారు. అక్క‌డే ఏకంగా 75 రోజులు ఉండి భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు చేయాల‌నుకున్నారు. దానికోసం డిసెంబ‌ర్ నుంచి ప‌ర్మిష‌న్లు కావాలంటూ ట్రై చేస్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కూడా అది కుద‌ర్లేదు. మొన్నీమ‌ధ్యే అన్ని ప‌ర్మిష‌న్లు వ‌చ్చాయి.. షూట్ చేసుకుంటాం అని చెప్పిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇప్పుడు మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గారు.

ఈ యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి దాదాపుగా 40 కోట్ల బడ్జెట్ అనుకున్నారట. కానీ దుబాయ్ గ‌వ‌ర్న‌మెంట్ త‌మ రోడ్ల‌పై ఇలాంటి యాక్ష‌న్ సీక్వెన్సులు చేయ‌డానికి అనుమ‌తి నిరాక‌రించింది. దాంతో సాహో టీంకు నిరాశ త‌ప్ప‌లేదు. ఇప్పుడు చేసేదేం లేక గ్రీన్ మ్యాట్ లో షూట్ చేయాలని మ‌ళ్లీ రామోజీ ఫిల్మ్ సిటీనే న‌మ్ముకుంటున్నారు సాహో టీం. ఇక్క‌డే దుబాయ్ రోడ్ల‌ను త‌ల‌పించేలా సెట్ వేసి భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు ప్లాన్ చేస్తున్నాడు సుజీత్. రియ‌ల్ దుబాయ్ లా అనిపించాల‌ని భారీ ఖ‌ర్చుతో ఈ సెట్ వేయిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. మ‌రి.. ఈ దుబాయ్ క‌ష్టాలు సాహోకు ఎప్పుడు తీరనున్నాయో..?

User Comments