మహేష్‌బాబు ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. `మహర్షి` తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నారని ప్రచారం సాగింది. కానీ మహేష్ మాత్రం అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ అనిల్ రావిపూడిని లైన్లోకి తీసుకొచ్చాడు. `ఎఫ్2`తో సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి పనితీరు మహేష్‌కి బాగా నచ్చిందట. దాంతో ఆయన కథ చెప్పగానే, సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ తర్వాతే సుకుమార్‌తో సినిమా చేయబోతున్నాడట.
అయితే అనిల్ చేయబోతున్న సినిమా `దూకుడు`కి రీమేక్‌గా తెరకెక్కబోతోందని సమాచారం. `దూకుడు` తీసిన దర్శకుడు శ్రీనువైట్ల దగ్గర అనిల్ రావిపూడి రైటర్‌గా పనిచేశారు. ఆ కథతో ఆయనకి బాగా కనెక్షన్ ఉందట. మహేష్ కోసం ఒక పోలీస్ స్టోరీని తయారు చేసిన అనిల్, దాన్ని దూకుడుకి ముడిపెడుతూ ఒక సీక్వెల్‌గా చేయబోతున్నారట. ఆ ఆలోచన మహేష్‌కి బాగా నచ్చడంతో గో ఎహెడ్ అని చెప్పారట. పేరు కూడా `వాట్సప్` అని ఫిక్స్ చేశారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.