Last Updated on by
మలయాళంలో వరస విజయాలు అందుకుంటూ అక్కడ క్రేజ్ సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఈయన ఇప్పుడు నేరుగా మహానటితో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. సావిత్రి భర్తగా.. రొమాంటిక్ హీరోగానే అందరికీ తెలిసిన జెమినీ గణేషన్ లో తెలియని ప్రేమికుడితో పాటు షాడిస్ట్ ను కూడా పరిచయం చేసింది మహానటి సినిమా. ఓ రకంగా సావిత్రి జీవితం నాశనం అయిపోవడానికి కారణం జెమినినే. ఈ పాత్రలో నటిస్తే కోపం ప్రేక్షకులకు వస్తుందని తెలుసు.. కానీ అందరూ తిట్టుకునేలా నటించాడు దుల్కర్ సల్మాన్. అంటే అంత అద్భుతంగా ఒదిగిపోయాడు ఆ పాత్రలో.
దుల్కర్ తన శరీరంలోకి జెమిని గణేషన్ ను నరనరాల్లోకి ఎక్కించేసుకున్నాడు. అప్పుడు జెమిని ఎలా ఉండేవాడు.. ఎలా నటించేవాడు అనే విషయంపై ఈ తరానికి ఐడియా ఉండదు. మహానటి చూస్తే చాలు జెమిని ఎలా ఉండేవాడనేది పర్ ఫెక్ట్ గా తెలిసిపోతుంది. ఓకే బంగారంతో ఓకే అనిపించిన ఈ హీరో.. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ సినిమాతో పరిచయం అయ్యాడు. మరి దుల్కర్ ప్రయాణం తెలుగులో ఎలా ఉండబోతుందో..?
User Comments