బంగారం అభిమాని దుర్మ‌ర‌ణం

Last Updated on by

అభిమానుల దుర్మ‌ర‌ణాలు హీరోల‌కు గుండె కోత లాంటివి. త‌మని క‌లుసుకోవాల‌న్న అత్యుత్సాహంలో వ‌చ్చి తిరిగి ఇంటికి వెళ్ల‌కుండా అభిమాని మ‌ర‌ణిస్తే ఆ ఘ‌ట‌న‌ను అంత తేలిగ్గా మ‌ర్చిపోవ‌డం క‌ష్టం. తాజాగా అలాంటి ఘ‌ట‌న ఒక‌టి `ఒకే బంగరం` ఫేం దుల్కార్ స‌ల్మాన్‌కి ఎదురైంది.

కేర‌ళ కొల్లాంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగు కోసం దుల్కార్ వ‌స్తున్నాడ‌న్న స‌మాచారంతో అక్క‌డికి పెద్ద ఎత్తున అభిమానులు గుమికూడారు. దుల్కార్ వచ్చాడు అన‌గానే ఒక్క‌సారిగా తోపులాట మొద‌లైంది. ఆ తోపులాట‌లో హ‌రి అనే ఓ అభిమానికి గుండె పోటు వ‌చ్చింది. అత‌డిని బ‌తికించేందుకు ఆస్ప‌త్రికి త‌రిలించే లోగానే మ‌ర‌ణించాడు. ఈ దుర్మ‌ర‌ణం ఊహించ‌నిది. అత‌డికి అది రెండో ఎటాక్ కావ‌డంతో చావును త‌ప్పించుకోలేక‌పోయాడు. త్రివేండ్రం నుంచి దుల్కార్‌ని క‌లుసుకోవాల‌న్న ఆశ‌తో అత‌డు వ‌చ్చాడు. తిరిగిరాని లోకాల‌కు ప‌య‌న‌మ‌య్యాడు. ఇప్పుడు అత‌డి కుటుంబ స‌భ్యుల‌కు దుల్కార్ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. క‌న్నీరు కార్చి, కొంత ధ‌న స‌హాయం చేయ‌గ‌ల‌డు కానీ, పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేడు క‌దా! ఈ ఘ‌ట‌న‌కు షాపింగ్ మాల్‌ యాజ‌మాన్యం స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని పోలీసులు కేసు బుక్ చేశారు. ఎవ‌రేం చేసినా అభిమాని ప్రాణం గాల్లో క‌లిసిపోయిన మాట వాస్త‌వం. ఎంత పిచ్చి అభిమానం ఉన్నా.. ఇలా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డం స‌రికాద‌ని ఈ ఘ‌ట‌న నిరూపించింది.

User Comments