భ‌గ్గుమ‌న్న అగ్ర నిర్మాత‌

Last Updated on by

`భ‌ర‌త్ అనే నేను` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం నిర్మించింది డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ – బోయ‌పాటి సినిమాని ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ నిర్మిస్తోంది. త‌దుప‌రి ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్ – రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్ మ‌ల్టీస్టార‌ర్ నిర్మిస్తున్న‌ది ఈ కంపెనీయే. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం కోసం 300కోట్ల వ‌ర‌కూ వెచ్చించ‌నున్నారన్న ప్ర‌చారం సాగింది.

అయితే డివివి సంస్థ‌పై కొన్ని మీడియాలు త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించాయ‌ని, అది త‌మ‌ను ఎంతో బాధించింద‌ని డివివి అధినేత‌, నిర్మాత దాన‌య్య తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భ‌ర‌త్ అనే నేను చిత్రానికి ప‌ని చేసిన ద‌ర్శ‌కుడికి, సాంకేతిక నిపుణులు, క‌థానాయిక‌కు పారితోషికాలు ఎగ్గొట్టార‌ని మీడియాలో ప్ర‌చార‌మైంది. అదంతా అస‌త్య ప్ర‌చారం అని ఖండించారు. ఒక‌వేళ ఏదైనా సందేహం ఉంటే త‌మ సంస్థ‌కు వ‌చ్చి అడ‌గొచ్చ‌ని ఆయ‌న అన్నారు. ఆ పుకార్ల‌కు బాధ‌ప‌డ్డాను. ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు రాయ‌డం స‌బ‌బు కాద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఇలాంటి త‌ప్పుడు క‌థ‌నాల వ‌ల్ల ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుందో గ్ర‌హించాల‌ని, త‌ప్పుగా రాయొద్ద‌ని ఆయ‌న కోరారు. గాసిప్పులు రాస్తే అవి నిర్మాణాత్మ‌కంగా ఉండాలి కానీ, సంస్థ‌కు డ్యామేజ్ జ‌రిగేవిగా ఉండ‌కూడ‌ద‌న్న‌ది రాసే జ‌ర్న‌లిస్టుల్లో ఉన్న రూల్. కానీ ఇటీవ‌లి కాలంలో కొంద‌రు అచ్చులు, హ‌ల్లుల‌కు తేడా తేలీని జ‌ర్న‌లిస్టులు సొంత వెబ్‌సైట్లు పెట్టుకుని క‌లం చేప‌ట్ట‌డంతో వ‌చ్చిన పెనుముప్పుగా డీవీవీ సంస్థ కానీ, లేదా ఇత‌ర సినీనిర్మాత‌లు కానీ గ్ర‌హించాల్సి ఉంటుంది.

User Comments