ప‌న‌మ్మాయిని కాపీ కొట్టేశా!

ప‌న‌మ్మాయికి లైనేయ‌డం ఇంటివోన‌రుకు అల‌వాటు. ఈవిడేంటి ఏకంగా ప‌న‌మ్మాయినే కాపీ కొట్టేసిందిట‌. ఇంట్లో ప‌ని చేసేప్పుడు, అంట్లు తోమేప్పుడు, బ‌ట్ట‌లు ఉతికేప్పుడు తెగ కాపీ కొట్టేసిందిట అదే ప‌నిగా. ఇంత‌కీ ఎవ‌రమ్మీ ఈ అమ్మీ!?

మా ప‌న‌మ్మాయినుంచి కొన్ని మ్యానరిజమ్స్ (నవ్వుతూ) కాపీ కొట్టేశాను.. అని ఈరోజు బ్రాండ్ బాబు ఇంట‌ర్వ్యూలో తెలుగ‌మ్మాయ్‌ ఇషా రెబ్బా చెప్పుకొచ్చింది. మారుతి క‌థ అందించ‌గా, సుమంత్ శైలేంద్ర – ఇషారెబ్బా జంట‌గా, ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వ ంలో తెర‌కెక్కిన బ్రాండ్ బాబు ఆగ‌స్టులో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఇషా ప‌న‌మ్మాయిగా న‌టించింది. ఈషా రెబ్బా మీడియాతో మాట్లాడుతూ – ఈ చిత్రంలో నా పాత్ర చాలా ముఖ్య‌మైన‌ది. క‌థానాయ‌కుడితో ల‌వ్ ఎలా మొదలవుతుంది, ఆ ప్రేమలో ఎదురయ్యే అపార్థాలేంటి? వాటిని ఎలా అదిగిమించాం.. అన్న‌ది తెర‌పైనే చూడాలి. మారుతి శైలిలో సాగే చ‌క్క‌ని రొమాంటిక్ కామెడీ మూవీ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుకోవొచ్చు. చాలా మంది హీరో పాత్రలో మమేకం అవుతారు. ఆ పాత్ర‌ను అంత అందంగా డిజైన్ చేశారు మారుతి. ఈ సినిమాలో కామెడీతో పాటు సెంటిమెంట్, రొమాన్స్ ఆక‌ట్టుకుంటాయి. ప్రేమ కథ హైలైట్‌గా ఉంటుంది. సుమంత్ ఇప్ప‌టికే క‌న్న‌డ‌లో రెండు మూడు చిత్రాల్లో న‌టించారు. న‌ట‌న‌కు కొత్తేమీ కాదు. చ‌క్క‌ని ప్ర‌తిభావంతుడు.. అని తెలిపారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సినిమా, సుమంత్ సినిమాలో న‌టిస్తున్నాను. తార‌క్ సినిమాలో ఓ కీల‌క పాత్ర అని మాత్రం చెప్ప‌గ‌ల‌ను… అని అంది.