ఎన్టీఆర్28లో తెలుగ‌మ్మాయ్‌

Last Updated on by

ఎన్టీఆర్ కెరీర్‌ 28వ సినిమా ఆన్‌సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. మాట‌ల మాయావి త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠ రేపే ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది.

ఈ సినిమాలో తార‌క్ స‌ర‌స‌న ముంబై బోల్డ్ బ్యూటీ పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అయితే రెండో నాయిక కోసం త్రివిక్ర‌మ్ ఇటీవ‌ల చాలా సీరియ‌స్‌గా వెతుకుతున్నారు. ఆ క్ర‌మంలోనే వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన చందంగా తెలుగ‌మ్మాయ్ ఈష త‌గిలిందిట‌. ఈ భామ న‌టించిన `అమీ తుమీ` చూసి త్రివిక్ర‌ముడు ప‌రేషాన్ అయిపోయాడ‌ని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు తార‌క్‌కి రెండో నాయిక‌గా త‌న‌ను ఎంపిక చేసుకున్నాడ‌ట‌. అయితే ఇది నిర్మాత‌లు క‌న్ఫామ్ చేయాల్సి ఉందింకా. అమీ తుమీ, అంత‌కుముందు ఆ త‌ర‌వాత, అ! వంటి చిత్రాల్లో విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న ఈష రెబ్బా కెరీర్ ప‌రంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దూసుకుపోతోంది. తెలుగ‌మ్మాయిల‌కు తెలుగులో అవ‌కాశాలు రావు అన్న నానుడిని ఈ భామ తిర‌గ‌రాస్తోంది. క్రేజీ అవ‌కాశాల‌తో దూసుకెళుతున్న తెలుగ‌మ్మాయ్ న‌వ‌త‌రం ఆర్టిస్టులంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది.

User Comments