శ్రీదేవి మరణం వెనుక వదంతులు నిర్మాత ఆవేదన

Last Updated on by

శ్రీ‌దేవి మ‌ర‌ణం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది. ఎక్క‌డ విన్నా ఇప్పుడు ఈ టాపిక్ త‌ప్ప మ‌రో టాపిక్ కూడా ర‌న్ కావ‌డం లేదు. అంత‌గా వైర‌ల్ అయిపోయింది ఇప్పుడు ఈమె మ‌ర‌ణం. శ్రీ‌దేవి చ‌నిపోయింది అనేదాని కంటే కూడా ఇప్పుడు ఎలా చ‌నిపోయింది.. ఇంత స‌డ‌న్ గా అలా ఎలా చ‌నిపోయింది అనే అనుమానాలే అంద‌ర్నీ వేధిస్తున్నాయి. కాస్మోటిక్స్ ఎక్కువ‌గా వాడ‌టం.. అందం కోసం ఎక్కువ సార్లు స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం లాంటివి చేసి త‌న‌కు తానుగా ఆరోగ్యం పాడు చేసుకుంద‌ని.. అందుకే అనుకోకుండా అనంత‌లోకాల‌కు అతిలోక‌సుంద‌రి ప‌య‌నం అయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌పై బాలీవుడ్ నిర్మాత‌, శ్రీ‌దేవి స‌న్నిహితురాలు ఏక్తాక‌పూర్ స్పందించింది. అస‌లు మీకేం తెలుస‌ని మాట్లాడుతున్నారు.. ఓ మ‌నిషి చ‌నిపోతే అందులో రాక్ష‌సానందం పొంద‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ నిల‌దీసింది.

మీడియాలో వ‌స్తోన్న వార్త‌ల‌పై కూడా ఆమె ఫైర్ అయ్యారు. అంతా అనుకుంటున్న‌ట్లుగా ఆమె కాస్మోటిక్స్ వ‌ల్లో.. కిడ్నీ ఫెయిల్యూర్స్ వ‌ల్లో.. స్ట్రెస్ తోనో చ‌నిపోలేద‌ని.. హార్ట్ ఎటాక్ వ‌చ్చింద‌ని చెప్పింది. ఓ మ‌నిషికి హార్ట్ ఎటాక్ ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యం ఎవ‌రికీ తెలియ‌దని.. ఈ రోజుల్లో చిన్న పిల్ల‌ల‌కు కూడా హార్ట్ స్ట్రోక్ వ‌స్తుంద‌ని అలాంటిదే శ్రీ‌దేవికి కూడా వ‌చ్చింద‌ని చెబుతుంది ఏక్తా. ద‌య‌చేసి దాన్ని అర్థం చేసుకోవాలి కానీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు అలా ఎలా రాస్తారు అంటూ ఫైర్ అయింది ఈ ఫైర్ బ్రాండ్. టూ మ‌చ్ ఆఫ్ కాస్మోటిక్స్ వ‌ల్లే శ్రీ‌దేవికి ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని బాలీవుడ్ లో ఓ వార్త కూడా ప్ర‌చురిత‌మైంది. అందుకే ఏక్తా ఇలా ఫైర్ అయింది. కానీ చనిపోయిన తర్వాత ఇలా ప్రచురితం చేయాడం మాత్రం తప్పు. లెజెండరీ యాక్ట్రెస్ అయిన శ్రీదేవి మీద ఇలా వదంతులు సోషల్ మీడియాలో ప్రచారం ఆపడం మంచిది.

User Comments