టీజ‌ర్: అంతా మంచోడు అంటుంటే

Entha Manchivaadavuraa (Source: Twitter)

అంద‌రూ మంచోడు మంచోడు అంటుంటే ఆ ఉతుకుడేంది? అస‌లు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈ స‌రికొత్త మేకోవ‌ర్ ఏమిటో.. ఫ‌స్ట్ టీజ‌ర్ తోనే అద‌ర‌గొట్టాడు. `ఎంత మంచివాడ‌వురా? `ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ద‌స‌రా కానుక‌గా రిలీజైంది. ఈ టీజ‌ర్ ఆద్యంతం ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం ఆక‌ట్టుకుంది. అలానే ఇందులో ప్ర‌తి పాత్ర ఒక్కో పేరుతో పిలుస్తూ మంచోడు మంచోడు అంటూ పొగిడేయ‌డం .. అయితే అంద‌రూ మంచోడు మంచోడు అంటుంటే ఇర‌గ్గొట్టేయ‌డం సంథింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి. మ‌రీ అంత‌గా ఇర‌గ్గొట్టేసేవాడిని మంచోడు అని పొగిడేయాల్సిన అవ‌స‌ర‌మేంటో? ఇక ప్ర‌తి పాత్ర ఒక్కో పేరుతో పిలుస్తున్నారు అంటే ఆ పాత్ర‌లో ఉన్న స‌స్పెన్స్ ఎలిమెంట్ ఏమిటో చూడాలి.

టీజ‌ర్ చూడ‌గానే స‌తీష్ వేగేష్న మ‌రోసారి శ‌త‌మానం భ‌వ‌తి ఫీట్ ని రిపీట్ చేస్తున్నాడా? అన్న సందేహం క‌లిగింది. అయితే ప‌ల్లె ప‌ట్టు సౌంద‌ర్యం.. కుటుంబాలు సాంప్ర‌దాయం అంటే అలాంటి సందేహం రావ‌డం స‌హ‌జ‌మే. ఇక గోదారి జిల్లాల అందం.. కేర‌ళ, క‌ర్నాట‌క లొకేష‌న్ల ప‌చ్చందం ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో యూనిక్ స్టోరి లైన్ ఎంత కొత్త‌గా ఉంది అన్న‌ది ఇంపార్టెంట్. మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీ‌నివాస క‌ళ్యాణం లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత కంబ్యాక్ అయ్యేందుకు స‌తీష్ వేగేష్న ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏమేర‌కు స‌ఫ‌లం అవుతారో చూడాలి. అలాగే టీజ‌ర్ తో ఆక‌ట్టుకున్నారు కాబ‌ట్టి క‌ళ్యాణ్ రామ్ పాత్ర‌లోని స‌స్పెన్స్ ఎలిమెంట్ ని ట్రైల‌ర్ తో రివీల్ చేస్తారేమో చూడాలి. ఠ‌ఫ్ కాంపిటీష‌న్ న‌డుమ 2020 సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయ‌నున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా- శ్రీ‌దేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.