ఎవ‌రు ఫిలింన‌గ‌ర్ టాక్

గూఢ‌చారి ఫేం అడివి శేష్ న‌టించిన తాజా చిత్రం ఎవ‌రు. రెజీన క‌థానాయిక‌. వెంక‌ట్ రాంజీ ద‌ర్శ‌కుడు. ఇదో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కేట‌గిరీ సినిమా. ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. ఆగ‌స్టు 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. స్పానిష్ మూవీ `ది ఇన్‌విజిబుల్ గెస్ట్` ఆధారంగా రూపొందించారు. ఇప్ప‌టికే అదే స్పానిష్ మూవీ స్ఫూర్తితో తెర‌కెక్కించిన హిందీ సినిమా బ‌ద్లా మెప్పించింది. అయితే తెలుగు ఆడియెన్ లో ఎవ‌రు ఎలా వ‌ర్క‌వుట్ కానుంది అన్న‌ది ఇప్ప‌టికైతే సస్పెన్స్. ఎవ‌రు తెలుగు ఆడియెన్ కి ఏ త‌ర‌హా ట్రీట్ ఇవ్వ‌బోతోంది? అంటే ఫిలింన‌గర్ టాక్ ఇలా ఉంది.

ఈ సినిమా ఫ‌స్టాఫ్ చూస్తే.. ఓ సింగిల్ రూమ్‌లోనే క‌థ న‌డుస్తుంది. అందువ‌ల్ల అది ఆడియెన్ కి బోర్ క‌లిగిస్తుంది. అస‌లైన ట్విస్టుల‌న్నీ సెకండాఫ్‌లో ఓపెన్ అవుతాయి. స్పానిష్ సినిమాతో పోలిస్తే `ఎవ‌రు` క్లైమాక్స్ ను డిఫ‌రెంట్ గా తెర‌కెక్కించారు. క్లైమాక్స్ పై ఆడియెన్ లో మిక్స్ డ్ రియాక్ష‌న్స్ ఉంటాయి. ఇక సినిమా ఆద్యంతం నెమ్మ‌దిగా సాగుతుంది కాబ‌ట్టి అది కేవ‌లం ఒక సెక్ష‌న్ ఆడియెన్ కి మాత్ర‌మే క‌నెక్ట‌వుతుంది. మాస్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే ఎలాంటి ఎలిమెంట్స్ ఎవ‌రు లో లేవు. ఎంచుకున్న క‌థాంశం, స్క్రీన్ ప్లే ప‌రంగా చూస్తే బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఇది బిలో యావ‌రేజ్ సినిమా. అబ్బూరి ర‌వి ఈ చిత్రానికి మాట‌లు అందించారు.

Also Read: Special Look Test For Mega Star