అప్పుడు.. ఇప్పుడు.. ర‌మ్య‌కృష్ణ అదే అందం..

అబ్బా.. ఏమి అందం..? ఎవ‌రికి సాధ్యం ఇంత అందం..? అచ్చంగా ఇదే అనాల‌నిపిస్తుంది క‌దా ర‌మ్య‌కృష్ణ‌ను ఈ ఫోటోలో చూస్తుంటే. ఇది ఇప్ప‌టి ఫోటో కాదు.. దాదాపు 25 ఏళ్ల కింద చేసిన ఫోటోషూట్. ఇండియ‌న్ ఫేమ‌స్ ఫోటోగ్ర‌ఫ‌ర్ రాకేష్ శ్రేష్ట చేసిన ఫోటోషూట్ ఇది. ఈ ఫోటోలో ర‌మ్య‌కృష్ణ‌కు ప్ర‌ఖ్యాత బాలీవుడ్ క్యాస్ట్యూమ్ డిజైన‌ర్ నితా లుల్లా ఔట్ ఫిట్ డిజైన్ చేసింది. అప్ప‌టికీ ఇప్ప‌టికీ వ‌య‌సు పెరిగిందేమో కానీ గ్లామ‌ర్ మాత్రం అక్క‌డే ఆగింది. సాధార‌ణంగా వ‌య‌సు 50కి చేరువ‌గా ఉన్న‌పుడు ఆంటీ అనాలి. కానీ కొంద‌రు  హీరోయిన్ల‌ను చూస్తుంటే ఆంటీ అనాల‌నిపించ‌దు. ఇప్ప‌టికీ వాళ్లు అలా అందాన్ని కాపాడుకుంటూ వ‌చ్చారు. అందులో ర‌మ్య‌కృష్ణ కూడా ఒక‌రు. ఈ పేరు చెబితే ఒక‌ప్పుడు స్క్రీన్స్ షేక్ అయిపోయేవి.. బాక్సులు బ‌ద్ద‌ల‌య్యేవి.. త‌న హాట్ గ్లామ‌ర్ షో తో సిల్వ‌ర్ స్క్రీన్ ను వేడెక్కించింది ర‌మ్య‌కృష్ణ‌.

30 ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఐటం సాంగ్స్ తో మ‌తులు పోగొట్టింది ర‌మ్య‌. ప్ర‌భాస్, ఎన్టీఆర్ లాంటి కుర్ర హీరోల‌తో కూడా కాలు క‌దిపింది ఈ బ్యూటీ. అయితే ఏ ముద్దుగుమ్మ‌కైనా ఏజ్ లిమిట్ ఉంటుంది. అది దాటిన త‌ర్వాత కూడా గ్లామ‌ర్ షో చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ర‌మ్య‌కృష్ణ విష‌యంలో మాత్రం ఇది మిన‌హాయింపు. ఇప్ప‌టికీ ఈమె హీరోయిన్ లకు ధీటుగానే క‌నిపిస్తుంది. సోగ్గాడే చిన్నినాయ‌నా సినిమానే దీనికి నిద‌ర్శ‌నం.

Evergreen beauty ramyakrishna.

ఒక‌ప్పుడు హాట్ ఫోటోషూట్ల‌తో పిచ్చెక్కించిన ర‌మ్య‌కృష్ణ‌.. ఈ మ‌ధ్యే ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై హాట్ లుక్ తో కేక పెట్టించేసింది ఈ ముదురు ముద్దుగుమ్మ‌. న‌డుము సోయ‌గాలు కూడా చూపిస్తూ ఊరిస్తుంది ఈ భామ‌. మొత్తానికి పాతికేళ్ల కింది ఫోటో అయినా కూడా ఇప్ప‌టికీ అదే అందంతో ఊపేస్తోన్న ర‌మ్య‌కృష్ణ‌కు నిజంగా సాహో అన‌కుండా ఉండ‌లేం..!

Ramyakrishna in swimsuit