అల్ల‌రి న‌రేష్ కొంప కొల్లేరు అయిందిగా..!

Last Updated on by

తెలుగు ఇండ‌స్ట్రీలో విచిత్ర‌మైన టైటిల్స్ పెట్టాలంటే ఇవివి సత్య‌నారాయ‌ణ‌ను మించిన వాళ్లు లేరు. తొలి సినిమా చెవిలో పువ్వు నుంచి చ‌నిపోయే ముందు చేసిన క‌త్తి కాంతారావు వ‌ర‌కు కూడా అన్నీ విభిన్న‌మైన టైటిల్స్ తోనే వ‌చ్చారు. అలాగే అప్ప‌ట్లో ఆయ‌న చ‌నిపోక ముందు కూడా కొన్ని క‌థ‌లు రాసి సిద్ధంగా ఉంచుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ విష‌యాన్ని ఇవివి త‌న‌యుడు అల్ల‌రి న‌రేష్ చెప్పారు. అప్ప‌ట్లో త‌న తండ్రి రాసుకున్న క‌థ‌ల్లో కొంప‌కొల్లేరు కూడా ఒక‌ట‌ని గుర్తు చేసుకున్నాడు న‌రేష్. అనుకున్న ప‌ని ఏదైనా జ‌ర‌క్క‌పోయినా.. అనుకున్న‌ది అనుకున్న‌ట్లు కాక‌పోయినా కూడా కొంప కొల్లేరు అయిపోయింది అంటాం. అలాంటి క‌థ‌తోనే ఇవివి ఓ క‌థ సిద్ధం చేసాడ‌ని.. అయితే అది ఆయ‌న మ‌ర‌ణంతో అనుకోకుండా ఆగిపోయింద‌ని చెప్పాడు అల్ల‌రోడు.

2012 యుగాంతం అంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.. దాంతో అదే కాన్సెప్ట్ తీసుకుని సెటైరిక‌ల్ గా త‌న తండ్రి ఓ క‌థ సిద్ధం చేసార‌ని.. హాస్పిట‌ల్లో ఉన్న‌పుడు ఆ క‌థ త‌న‌కు చెప్పార‌ని కూడా చెప్పాడు అల్ల‌రి న‌రేష్. అప్పుడు కానీ ఆ సినిమా వ‌చ్చుంటే బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యుండేదని.. దాంతో పాటు మ‌రికొన్ని క‌థ‌లు కూడా త‌న తండ్రి చెప్పార‌ని.. అయితే వాటిని తెర‌కెక్కించే ద‌ర్శ‌కులు ఇప్పుడు లేర‌ని తేల్చేసాడు అల్ల‌రి న‌రేష్. మొత్తానికి ఇవివి మర‌ణం న‌రేష్ కెరీర్ కు కూడా శాపంగానే మారింది. ఎందుకంటే ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత ఒక్క సుడిగాడు మాత్రమే హిట్ అయింది. అప్ప‌ట్లో అల్ల‌రి న‌రేష్ కెరీర్ ఎప్పుడు గాడిత‌ప్పినా.. తండ్రి వ‌చ్చి హిట్టిచ్చేవాడు. ఇప్పుడు ఆ లోటు అలాగే క‌నిపిస్తుంది.

User Comments