సైరా లీక్స్‌: డేగ క‌న్ను ఔట్‌!

Last Updated on by

శ్రీ‌రెడ్డి ర‌చ్చ‌తో .. టాలీవుడ్ హాలీవుడ్‌ని మించి పాపుల‌రైన సంగ‌తి తెలిసిందే. లైంగిక వేదింపులు అన్న టాపిక్‌తో గ‌త కొంత‌కాలంగా టీవీ చానెళ్లు శ్రీరెడ్డిని అడ్డు పెట్టుకుని టీఆర్‌పీ ఆట ఆడుకున్నాయ్‌. ఈ గేమ్ మాట ఎలా ఉన్నా.. ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం మొత్తం పుంఖానుపుంఖాలుగా బ‌య‌ట‌ప‌డింది. ప‌నిలో ప‌నిగా ఈ వ్య‌వ‌హారంలో వేదింపులు ఎదుర్కొన్న ప‌లువురు జూ.ఆర్టిస్టులు కూడా టీవీల‌కెక్కి నానా ర‌చ్చ చేశారు. మ‌హిళా మండ‌ళ్ల స‌మ‌క్షంలో, ప్రెస్‌క్ల‌బ్ లో ప్రెస్‌మీట్లు పెట్టి నానా ఇదిగా గానా భ‌జానా చేశారు.

ఈ వేదింపుల ర‌చ్చ అక్క‌డితో ఆగిపోలేదు. ప్ర‌స్తుతం దేశంలోనే ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంగా తెర‌కెక్కుతున్న `సైరా-న‌ర‌సింహారెడ్డి`కి అంటుకుంది మ‌కిలి. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ప‌ని చేస్తున్న‌ వాకాడ అప్పారావు ప‌లువురు మ‌గువ‌ల‌పై వేదింపుల‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఓ టీవీ చానెల్ లైవ్‌లో దీనిపై డిబేట్ కూడా న‌డిచింది. అమ్మాయిల్ని ఏడిపించాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో మెగా -కొణిదెల క్యాంప్ ప్ర‌క్షాళ‌న చ‌ర్య‌ల్లో భాగంగా వాకాడ‌ను దూరం పెట్టార‌ని తెలుస్తోంది. ప‌లువురు మీడియా ప్ర‌ముఖులు అత‌డిని ఫోన్‌లో సంప్ర‌దించాల‌ని చూస్తే, ఫోన్ స్విచ్ఛాఫ్ రావ‌డం సందేహాల‌కు తావిచ్చింది. శ్రీ‌రెడ్డి & గ్యాంగ్స్ ఎటాక్‌తో ప‌రిశ్ర‌మ బూతు కాండ ఎపిసోడ్ ఎపిసోడ్లుగా బ‌య‌టికి లీకైంది. ఇప్పుడిలా సైరా టీమ్‌కి త‌ల‌నొప్పులు తెచ్చింద‌న్న‌మాట‌!!

User Comments