ఎగ్జిట్ పోల్ రిపోర్ట్‌: వైకాపా- తేదేపా 50-50 రిజ‌ల్ట్!!

Last Updated on by

ఏడు ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు ప‌రిశీలిస్తే.. తేదేపా- వైకాపా 50-50 ఛాయిస్ అని తేలింది. అంటే ఈసారి ఏపీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కింగ్ మేక‌ర్ కాబోతోందా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. లగడపాటి సర్వేతో పాటు ఐఎన్ఎస్ఎస్, ఐలైట్ తేదేపాకే ప‌ట్టంగ‌ట్టాయి. చాణ‌క్య‌, వీడీపీ అసోసియేట్స్, పీపుల్స్ ప‌ల్స్ సంస్థలు కూడ వైకాపాకు అనుకూలంగా సర్వే ఫలితాలు ఉంటాయని ప్రకటించాయి.. మిగిలిన చాలా సంస్థల సర్వే పలితాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇతర సర్వే సంస్థలు టీడీపీకి… వైసీపీకి మధ్య సీట్ల సంఖ్య చాలా తేడా ఉన్నట్టుగా ప్రకటించాయి. ఈసారి ల‌గ‌డ‌పాటి చెప్పిన ప్ర‌కారం 10 శాతం ఓట్లు జ‌న‌సేన‌కు వ‌చ్చినా కింగ్ మేక‌ర్ అవ్వొచ్చు. అస‌లు వాస్త‌వాల్ని మే 23న మాత్ర‌మే తేల‌నున్నాయి. ఓసారి ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన ఎగ్జిట్ పోల్ స‌ర్వేలను ప‌రిశీలిస్తే..

లగడపాటి సర్వే

టీడీపి-100
వైసీపీకి- 72
ఇతరులకు -3

ఐఎన్ఎస్ఎస్ సర్వే

టీడీపీ -118
వైసీపీ- 52
జనసేన -5

ఐలైట్ సర్వే

టీడీపీ 106-
వైసీపీ 68 –
జనసేన -1
వైకాపా.. తేదేపాకు 5పెర‌గొచ్చు లేదా త‌గ్గొచ్చు..

మిషన్ చాణక్య

టీడీపీకి 55 -60
వైసీపీ 91 -105
ఇతరులు 5-9

పీపుల్స్ పల్స్

వైసీపీ – 112
టీడీపీ- 59
జనసేన- 4

ఆరా
వైసీపీ -120
టీడీపీ -50
జనసేన -0

వీడీపీ అసోసియేట్స్

టీడీపీ 54-60
వైసీపీ 111-121
జనసేన 4

ఇండియా టుడే(లోక్‌సభ)
తెదేపా: 4 – 6
వైకాపా: 18 – 20
భాజపా: 0 – 1
కాంగ్రెస్‌: 0 – 1
ఇతరులు: 0