జ‌న‌సేనానికి ఐ ఆప‌రేష‌న్‌?

Last Updated on by

జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కంటికి శ‌స్త్ర‌చికిత్స జ‌ర‌గ‌నుందా? అంటే అవుననే స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌జా పోరాట యాత్ర‌ల్లో పాల్గొంటున్న వేళ కంటి సంబంధ స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఆ క్ర‌మంలోనే గ‌త నెల‌లో ఇచ్ఛాపురం టు శ్రీ‌కాకుళం యాత్ర‌లో ప్ర‌త్యేకించి న‌ల్ల క‌ల్ల‌ద్దాల్ని ధ‌రించారు. ఇక‌పై జూన్ 26 నుంచి విశాఖ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ క్ర‌మంలోనే ఇంకా కంటి సంబంధ స‌మ‌స్య చికాకులు తెస్తుండ‌డంతో ఆస్ప‌త్రికెళ్లి చికిత్స చేయించుకునేందుకు రెడీ అయ్యార‌ట‌.
కంటి స‌మ‌స్య పెద్ద స‌మ‌స్య‌. అందుకే హైద‌రాబాద్ ఎల్‌వి ప్ర‌సాద్ కంటి ఆస్ప‌త్రి డాక్ట‌ర్ల‌ను చికిత్స కోసం ప‌వ‌న్ సంప్ర‌దించార‌ట‌. డాక్ట‌ర్లు కళ్ల‌ను ప‌రిశీలించి శ‌స్త్ర‌చికిత్స‌ త‌ప్ప‌నిస‌రి అని చెప్ప‌డంతో తాను సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. జూన్ 26 యాత్ర ముగించుకున్న అనంత‌రం ఆప‌రేష‌న్‌కు తేదీని ఫిక్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

User Comments