ఎఫ్ 2 సేవ్ చేసింది

Last Updated on by

సంక్రాంతి సినిమాల రిజ‌ల్ట్ పై క్లారిటీ వ‌చ్చేసింది. సంక్రాంతి బ‌రిలో నాలుగు సినిమాలు రిలీజైతే, వీటిలో ఎఫ్ 2 స్ప‌ష్టంగా విజేత‌గా నిలిచింది. ఈ సినిమా తొలి వారం 43 కోట్లు వ‌సూలు చేసి పంపిణీ వ‌ర్గాల్లో ఉల్లాసం నింపింది. ఈ చిత్రం ఫుల్ ర‌న్ లో 55-60 కోట్లు వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. నిర్మాత దిల్ రాజును ఫుల్ ఖుషీ చేసిన ఫ‌లిత‌మిది.
రామ్ చ‌ర‌ణ్  `విన‌య విధేయ రామ` చిత్రం 90 కోట్లు పైగా బిజినెస్ చేయ‌గా, 8 రోజుల‌కు వీవీఆర్‌- 60కోట్ల షేర్‌ వ‌సూలు చేసింది. 54కోట్ల వ‌ర‌కూ తెలుగు రాష్ట్రాల నుంచి వ‌సూలు చేయ‌గా, 6కోట్లు ఇత‌ర చోట్ల నుంచి వ‌సూలైంది. ఇక బాల‌కృష్ణ క‌థానాయ‌కుడు చిత్రం 60-65 కోట్ల మేర‌ ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తే బాక్సాఫీస్ వ‌ద్ద‌ 20కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసి చ‌తికిల‌బ‌డ‌డంపైనా ట్రేడ్‌లో చ‌ర్చ సాగుతోంది. ఎఫ్ 2 ఇప్ప‌టికే లాభాల బాట ప‌ట్టింది. ఇక‌పై వ‌సూలు చేసేదంతా లాభ‌మేన‌న్న మాటా వినిపిస్తోంది. ఇక‌పోతే విన‌య విధేయ రామ చిత్రం మ‌రో 30 కోట్ల షేర్ వ‌సూలు చేస్తేనే సేఫ్ అయిన‌ట్ట‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. అయితే ఈ మూడు చిత్రాలకు సోమ‌వారం నుంచి విష‌మ‌ ప‌రీక్ష ఎదురు కానుంది. ఇప్ప‌టికే పండ‌గ సెల‌వులు అయిపోయాయి. ఇక‌పైనా వ‌సూళ్లు రాబ‌డితేనే పంపిణీదారుల‌కు ఉల్లాసం ఉత్సాహం రెట్టింప‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు.

User Comments