ఎఫ్ 2 డైరెక్ట‌ర్ పారితోషికం ఎంత‌?

Last Updated on by

`ఎఫ్ 2` చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు అనీల్ రావిపూడి. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 90 కోట్లు వ‌సూలు చేసింద‌ని ప్ర‌చార‌మైంది. దిల్ రాజు కెరీర్ బెస్ట్ హిట్ ని ఇచ్చిన ద‌ర్శ‌కుడిగా అనీల్ రావిపూడి పేరు మార్మోగిపోయింది. వెంకీ, వ‌రుణ్ తేజ్ కెరీర్ కి అనీల్ రావిపూడి బిగ్ బూస్ట్ ఇచ్చాడు. అందుకే ఈ ద‌ర్శ‌కుడిని సెంటిమెంట్ గా వ‌రుస సినిమాల‌కు లాక్ చేశారు దిల్ రాజు. మ‌హేష్ – అనీల్ రావిపూడి చిత్రం ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఈ చిత్రాన్ని ఏకేఎంట‌ర్‌టైన్ మెంట్స్ అధినేత అనీల్ సుంక‌ర‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. త‌దుప‌రి మ‌హేష్ తో వేరొక సినిమా చేసేందుకు దిల్ రాజు ప్లానింగులో ఉన్నారు. అలాగే 2020లో ఎఫ్ 2 సీక్వెల్ ని అనీల్ రావిపూడితో తెర‌కెక్కించే ప్లాన్ లోనూ దిల్ రాజు ఉన్నారు.

ఇంత పెద్ద లైన‌ప్ ఉంది కాబ‌ట్టి అనీల్ రావిపూడి డిమాండ్ హై లెవ‌ల్లో ఉంద‌ని తెలుస్తోంది. అత‌డికి ఒక్కో క‌మిట్ మెంట్ కి 12కోట్ల పారితోషికం ముట్ట‌జెబుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం సెట్స్ కెళుతున్న మ‌హేష్ చిత్రానికి అత‌డు అంత డిమాండ్ చేశాడ‌ని తెలుస్తోంది. వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతూ స్వ‌యంకృషితో ఎదిగేస్తున్న ద‌ర్శ‌కుడిగా అనీల్ రావిపూడి పేరు మార్మోగిపోతోంది. అనీల్ రావిపూడి ప‌వ‌న్ క‌ల్యాణ్ `త‌మ్ముడు` ద‌ర్శ‌కుడు పీ.ఏ.అరుణ్ ప్ర‌సాద్ కి క‌జిన్ అన్న సంగ‌తి తెలిసిందే.


Related Posts